ప్రతీ స్మార్ట్‌ఫోన్ తయారీలో బంగారం.. ఎన్ని గ్రాములంటే..?

Venkatrao Lella

Images: Pinterest

25 SEP 2026

ప్రస్తుతం ఎవరి చేతిలో చేసినా స్మార్ట్‌ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరం ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇది లేనిది ఏ పని జరగడం లేదు.

స్మార్ట్ ఫోన్లు, వాటి బ్యాటరీలు, చిప్‌ల తయారీ కోసం 10 రకాల ఖనిజాలను ఉపయోగిస్తారు. బంగారం, వెండి, రాగి వంటి లోహలను కూడా వినియోగిస్తారు. దీని వల్లనే స్మార్ట్‌ఫోన్ ధరలు ఎక్కువగా ఉంటాయి

ఒక్కొ స్మార్ట్ ఫోన్ తయారీకి 7 నుంచి 34 మిల్లీ గ్రాముల బంగారం వినియోగిస్తారట. సర్క్యూట్ బోర్డులు, యూఎస్బీ పోర్ట్‌లు, బ్యాటరీ టెర్మినల్స్, సిమ్, ఎస్డీ కార్డులు, మైక్రోచిప్స్ వైర్లలో బంగారం ఉపయోగిస్తారట

ఒక్కొ స్మార్ట్‌ఫోన్‌లో 200 నుంచి 350 మిల్లీ గ్రాముల వెండి వినియోగిస్తారు. స్విచ్‌లు, సోల్డర్లు, సర్క్యూట్ బోర్డులు, అంతర్గత కనెక్షన్ పాయింట్లు, మైక్రో చిప్స్, సెమీ కండక్టర్లలో వీటిని వాడతారు.

15 నుంచి 30 గ్రాముల వరకు ఒక్కొ స్మార్ట్‌ఫోన్‌లో రాగి ఉపయోగిస్తారు. సిగ్నల్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రికల్ కండక్టివిటీ, థర్మర్ మేనేజ్‌మెంట్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, చిప్స్, బ్యాటరీలు, మైక్రోఫోన్లు, ఛార్జింగ్ వైరింగ్‌లో ఉపయోగపడతాయి.

టాంటలమ్ 40 మిల్లీగ్రాముల వరకు వినియోగిస్తారు. వేడిని తట్టుకునేందుకు ఇది సహాయం చేస్తుంది,. కంపార్ట్, కెపాసిటర్లకు దీనిని వినియోగిస్తారు

లిథియం అయాన్ బ్యాటరీల్లో కోబాల్ట్ ఉపయోగిస్తారు. బ్యాటరీల పనితీరు, భద్రతను ఇది మెరుగుపరుస్తుంది.

అయాన్ బ్యాటరీకి శక్తినివ్వడానికి లిథియంను ఉపయోగిస్తారు. ఒక్కో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలో 1 నుంచి 3 గ్రాముల స్వచ్ఛమైన ఎలిమెంటల్ లిథియం వినియోగిస్తారు.

10 నుంచి 15 గ్రాముల గ్రాఫైట్ ఒక్కొ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగిస్తారు. లిథియం - అయాన్ బ్యాటరీలో ఇది నిక్షిప్తమై ఉంటుంది. బ్యాటరీ బరువులో 10 నుంచి 20 శాతం గ్రాఫైటే ఉంటుంది.