ది ప్యారడైజ్
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న భారీ ప్రాజెక్ట్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్, డ్రామా అంశాలతో రూపొందుతోంది. నాని ఈ సినిమాలో ఇంతకుముందెన్నడూ చూడని విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది. దసరా తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు నాని, శ్రీకాంత్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా నాని లుక్, ఆయన పాత్ర తీరు అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. కథలో భావోద్వేగాలు, సంఘర్షణ, యాక్షన్‌కు ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. మంచి కథతో పాటు అద్భుతమైన సాంకేతిక విలువలు, సంగీతం, నిర్మాణ ప్రమాణాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కలయికపై ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే అనిరుధ్ మ్యూజిక్ ఈ మూవీకి హైలెట్ అని చెప్పాలి. ది ప్యారడైజ్ విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇంకా చదవండిNani: ది ప్యారడైజ్ ఎఫెక్ట్.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంందిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Rajeev Rayala
- Updated on: Oct 7, 2026
- 1:09 pm
The Paradise : ది ప్యారడైజ్ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఆ ఒక్క కారణమే అంటున్న బ్యూటీ..
ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా ది ప్యారడైజ్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, న్యాచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవడంపై టాలీవుడ్ హీరోయిన్ స్పందించింది.
- Rajitha Chanti
- Updated on: Oct 4, 2026
- 8:46 am
The Paradise: మస్త్ చేశావయ్యా..! కేసీఆర్ పాత్రలో జీవించావు..! ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు
ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. 'ప్యారడైజ్' సినిమాలో కేసీఆర్ గారి పాత్రలో జీవించావు అంటూ అభినందించారు.
- Rajeev Rayala
- Updated on: Sep 30, 2026
- 12:35 pm
Nani : మేడారంలో ది ప్యారడైజ్ టీమ్.. సమ్మక్క, సారాలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన నాని..
ఇటీవలే ది ప్యారడైజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నాని. దసరా తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జతకట్టిన నాని.. ఈసారి పక్కా మాస్ అవతారంతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రఫ్పాడిస్తుంది. ఈ క్రమంలోనే ది ప్యారడైజ్ టీంతో కలిసి మేడారంలోని సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు హీరో నాని.
- Rajitha Chanti
- Updated on: Sep 29, 2026
- 4:16 pm
The Paradise: ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..!! ది ప్యారడైజ్ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!! కానీ
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నప్పటికీ.. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
- Rajeev Rayala
- Updated on: Sep 29, 2026
- 8:26 am
నేను చెప్పాలనుకుంది ఒకటి.. వాళ్లకు అర్ధమైంది ఇంకొకటి..! కయాదు సీన్‌పై డైరెక్టర్ క్లారిటీ.!
‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దూసుకుపోతుంది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాతల ప్రకారం, మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.136 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. అయితే ఒకవైపు వసూళ్లపై వార్తలు వస్తుండగా, మరోవైపు కయాదు లోహార్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
- Rajeev Rayala
- Updated on: Sep 28, 2026
- 10:46 am
నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సుదర్శన్ థియేటర్‌లో నాని నటించిన ద పారడైజ్ సినిమాను వీక్షించారు. అనేక సంవత్సరాల తర్వాత థియేటర్‌కు వెళ్లిన కేటీఆర్, సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను, నాని నటనను కొనియాడారు. సినిమా అస్తిత్వ పోరాట ఇతివృత్తం తనను ఆకట్టుకుందని తెలిపారు.
- Samatha J
- Updated on: Sep 28, 2026
- 12:15 pm
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.
- Rajeev Rayala
- Updated on: Sep 27, 2026
- 1:03 pm
దమ్ము దైర్యం ఉండాలి.. దేవతలతో పెట్టుకోకండి.. నాని ప్యారడైజ్ సినిమాపై వేణు స్వామి
దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయేల్, సోనాలి కులకర్ణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
- Rajeev Rayala
- Updated on: Sep 26, 2026
- 8:21 am
హీరోయిన్‌ను బీట్ చేసేలా ఉందిగా..! ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్‌గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడగా.. తెరపై కనిపించిన పలువురు నటీనటులు, పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది.
- Rajeev Rayala
- Updated on: Sep 25, 2026
- 1:28 pm
హేయ్.. మేడం ఇది మీరేనా.!! నాని ప్యారడైజ్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది.
- Rajeev Rayala
- Updated on: Sep 25, 2026
- 8:05 am
The Paradise: దసరా, హిట్ 3 రికార్డులు బద్దలు.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కొట్టిన ప్యారడైజ్
దసరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పారడైజ్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో ది ప్యారడైజ్ మూవీ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటన్నింటినీ నిలబెడుతూ పారడైజ్ అంచనాలు అందుకుంది.
- Rajeev Rayala
- Updated on: Sep 25, 2026
- 7:08 am