The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా నాని ది ప్యారడైజ్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా మెప్పించలేకపోవడంతో ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా అదిరిపోయింది అంటుంటే మరికొంతమంది మాత్రం సినిమా అంతగా లేదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించి నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ అందుకున్న సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది ప్యారడైజ్ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ‘ది ప్యారడైజ్’ కథ 1980ల నాటి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. సమాజంలో అణచివేతకు గురైన సవారీ తెగ ప్రజల జీవన పరిస్థితులు, వారి హక్కుల కోసం చేసే పోరాటం ఈ కథకు ప్రధాన నేపథ్యం. పేదరికం, సామాజిక వివక్ష, అధికార దుర్వినియోగం వంటి అంశాలను యాక్షన్తో మేళవిస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాలో నాని జడల్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. తన ప్రజలకు ఎదురవుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ.., వారిని అణచివేసే శక్తులను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయన పాత్ర సాగుతుంది. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్తో పాటు సామాజిక అంశాలు, ఎమోషన్స్ కు ప్రాధాన్యం దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా సినిమాతో నాని కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈ చిత్రంలోనూ రా అండ్ రస్టిక్ మేకింగ్కు ప్రాధాన్యం ఇచ్చారు. జడల్ పాత్ర కోసం నాని ప్రదర్శించిన కొత్త బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
‘ది ప్యారడైజ్’ థియేటర్లలో విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లతో వార్తల్లో నిలిచింది. ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.74.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో నాని కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. థియేటర్లలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ది ప్యారడైజ్’ను ఇంట్లోనే చూడాలని చాలామంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, అక్టోబర్ 23నే స్ట్రీమింగ్ అవుతుందా.? లేక విడుదల తేదీలో మార్పు ఉంటుందా.? అన్నది నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతోనే క్లారిటీ వస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
