AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

నాని నటించిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
The Paradise
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2026 | 1:03 PM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నానితో పాటు మోహన్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది ప్యారడైజ్ మూవీ. ఈ సినిమా మూడు రోజులకే 136కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ప్యారడైజ్ సినిమాలో చాలా మంది నటీ నటులు నటించారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?  సినిమాలోని కథ, పాత్రల వేషధారణ కారణంగా కొంతమంది నటీనటులను ఊహించని లుక్‌లోనే చూడాల్సి వస్తుంది. దీంతో తెరపై చూసిన నటీనటులను బయట ఫొటోల్లో చూసినప్పుడు అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు ఈ అమ్మడు విషయంలోనూ అదే జరుగుతుంది. ఆమెను బయట చూస్తే ఫిదా అవుతారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఆమె పేరు విషిక ది ప్యారడైజ్‌లో కీలక పాత్రను పోషించారు. సినిమాలో ఆమె లుక్ కథకు, పాత్రకు తగ్గట్టుగా ఉండటంతో.. బయట ఆమె ఎలా ఉంటారనే ఆసక్తి కొంతమంది ప్రేక్షకుల్లో మొదలైంది. ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విషిక గతంలో కమిటీ కుర్రాళ్లు సినిమాలో పద్మ పాత్రలో నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విషిక అసలు పేరు కీర్తి అని, సినీ రంగంలోకి వచ్చిన తర్వాత విషిక అనే పేరుతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

విషిక సినీ ప్రయాణం ఎమోషనల్ ఫుల్ తో ప్రారంభమైంది. ఆ తర్వాత పాగల్ Vs కాదల్, కమిటీ కుర్రాళ్లు వంటి చిత్రాల్లో కనిపించారు. తాజాగా ది ప్యారడైజ్ లో భాగం కావడంతో ఆమె పేరు మరోసారి తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా నాని వంటి స్టార్ హీరో నటించిన భారీ చిత్రంలో అవకాశం రావడం ఆమె కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగుగా చెప్పుకోవచ్చు. విషిక సినిమాల్లో కనిపించే పాత్రలతో పోలిస్తే బయట ఫొటోషూట్లలో, సోషల్ మీడియా ఫొటోల్లో మరింత మోడ్రన్, గ్లామరస్ లుక్‌లో కనిపిస్తుంటారు. దీంతో ది ప్యారడైజ్’లో చూసిన ఈమెనేనా.? అంటూ నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

View this post on Instagram

A post shared by Kirthi♊️ (@vishika_14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us