AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్క హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. సెట్‌లో ఆయన చేసే అల్లరి మాములుగా ఉండదు

నటుడు అమిత్ తివారీ ఇటీవల ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, ప్రముఖ నటులతో తన అనుభవాలను పంచుకున్నారు. అలాగే ఓ స్టార్ హీరోతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను, మరి కొంతమంది స్టార్ హీరోల నుంచి లభించిన అభినందనలను ఆయన ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

ఆ ఒక్క హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. సెట్‌లో ఆయన చేసే అల్లరి మాములుగా ఉండదు
Amith
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2026 | 3:06 PM

Share

అమిత్ తివారీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన అభిమాన హీరోలలో ఒకరని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తనకు చాలా ఇష్టమని తెలిపారు. “ఎన్టీఆర్‌తో నేను దాదాపు ఆరు, ఏడు సినిమాలలో పనిచేశాను అని తెలిపాడు. ఏ హీరోతోనూ అన్ని చిత్రాలలో నటించలేదు” అని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌తో పనిచేయడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. సెట్స్‌లో ఎన్టీఆర్ జూనియర్ చాలా సరదాగా, చిల్డ్ ఔట్ పర్సన్‌గా ఉంటారని, నిజంగా కిడ్ ఆన్ ది సెట్ అని అమిత్. షాట్ సమయంలో ఆయన చాలా సీరియస్‌గా ఉంటారని, కానీ షాట్ పూర్తవగానే జోకులు వేస్తూ, అందరినీ నవ్విస్తూ, అల్లరి చేస్తూ సరదా వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని. ఆయనతో పనిచేయడం అద్భుతంగా ఉంటుంది. ఒక గొప్ప నటుడితో పనిచేస్తున్నప్పుడు, ఆయన నుంచి పనిని కూడా నేర్చుకోవచ్చు అని అమిత్ తెలిపారు.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

తన కెరీర్‌లో అత్యంత మర్చిపోలేని, భావోద్వేగ క్షణాలను కూడా అమిత్ తివారీ పంచుకున్నారు. వాటిలో మొదటిది, రవితేజ కథానాయకుడిగా నటించిన విక్రమార్కుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన. “విక్రమార్కుడు షూటింగ్‌లో నా నటనను చూసి రవితేజ గారు ప్రశంసించారు. నా నటనలో మ్యాడ్ పర్సన్ క్యారెక్టర్‌ను చేస్తున్నప్పుడు, ఆయన, రాజీవ్ కనకాల అన్నయ్య గట్టిగా నవ్వుతున్నారు. నేను వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారని మొదట అనుకున్నాను. కానీ లంచ్ బ్రేక్‌లో రవితేజ గారు పిలిచి, చాలా బాగా చేస్తున్నావు, నిన్ను చూస్తుంటే మాకు చాలా సరదాగా ఉంది అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది” అని అమిత్  చెప్పుకొచ్చారు.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

రెండవ, అత్యంత ముఖ్యమైన సంఘటన విక్రమార్కుడు విడుదలైన తర్వాత చోటు చేసుకుంది. ఈ సంఘటనను అమిత్ తివారీ ఎన్నో ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. “విక్రమార్కుడు విడుదలైన తర్వాత, ఒకరోజు డబ్బింగ్ స్టూడియోలో చిరంజీవి గారు డబ్బింగ్ చెబుతున్నారు. నేను కూడా నా డబ్బింగ్ కోసం బయట ఎదురుచూస్తున్నాను. ఆయన డబ్బింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చి, నా వైపు చూసి నవ్వుతూ, తన మేకప్ మ్యాన్‌కు ఏదో చెప్పారు. ఆ మేకప్ మ్యాన్ వచ్చి, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నప్పుడు, నాకు ఒక క్షణం భయమేసింది. లోపలికి వెళ్ళగానే, చిరంజీవి గారు తన సీటు నుంచి లేచి, నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. నా వీపుపై తట్టి, మొన్ననే విక్రమార్కుడు చూశాను, నీ క్యారెక్టర్ చాలా బాగుంది, నువ్వు చాలా బాగా చేశావు. మంచి భవిష్యత్తు ఉంది నీకు, గాడ్ బ్లెస్ యు అని చెప్పి, నా బుగ్గలపై తట్టారు” అని అమిత్ తివారీ చెప్పుకొచ్చారు. ఆ క్షణం తనకు అవార్డు వచ్చినంత ఆనందాన్ని ఇచ్చిందని, ఆ సంఘటన తర్వాత నాలుగు రోజులు తనకు నిద్ర పట్టలేదని, డబ్బింగ్ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోవాలనిపించిందని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us