AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాలో ఓ చెత్త సీన్ తీశా.. ఇప్పటికీ నాకు బాధగానే అనిపిస్తుంది.. కానీ తప్పలేదు

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.వి.వినాయక్ తన దర్శకత్వ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, తీసుకున్న నిర్ణయాలను, కొన్ని చిత్రాలపై తనకున్న అంతర్గత అభిప్రాయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన జడ్జ్‌మెంట్ లోపాలు, సినీ విమర్శలను ఎదుర్కొనే విధానంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ఆ సినిమాలో ఓ చెత్త సీన్ తీశా.. ఇప్పటికీ నాకు బాధగానే అనిపిస్తుంది.. కానీ తప్పలేదు
Vv Vinayak
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2026 | 3:54 PM

Share

ఒకప్పుడు తాను తీసిన బిగ్గర్ దెన్ లైఫ్ అంటే,  ఫైట్ సీక్వెన్స్‌లు, హైపర్ డ్రామాను ప్రేక్షకులు ఆదరించారని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేదని, ప్రేక్షకులు కూడా అలాంటి అన్-రియలిస్టిక్ సన్నివేశాలను చూడటానికి సిద్ధంగా ఉండేవారని వినాయక్ తెలిపారు. అయితే, ఆతర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయని, ఇప్పుడు కారణం లేకుండా అలాంటి సన్నివేశాలను పెడితే ఆదరించరని ఆయన అన్నారు. పది సంవత్సరాలలో మీడియా, ప్రేక్షకుల ఆలోచనలు అప్‌డేట్ అయ్యాయని, తాను కూడా వారితో పాటు అప్‌డేట్ అవ్వాల్సిన అవసరాన్ని గుర్తించానని వినాయక్ చెప్పుకొచ్చారు. కొన్ని సన్నివేశాల గురించి తాను బాధపడిన సందర్భాలు ఉన్నాయని వినాయక్ తెలిపారు.

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

చెన్నకేశవ రెడ్డి సినిమా విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని, అది తన బెస్ట్ వర్క్ అని ఆయన పేర్కొన్నారు. కథలో స్క్రీన్‌ప్లేలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చని, తాను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్‌గా మారిందని వినాయక్ అన్నారు. బాలకృష్ణ వంటి స్టార్‌తో పెద్ద బడ్జెట్ సినిమా తీస్తున్నప్పుడు ఉండే ఒత్తిడి, మెచ్యూరిటీ లేమి వంటివి దీనికి కారణమని అన్నారు. అయితే, సాంబ సినిమా విషయంలో మాత్రం తాను తీవ్రంగా బాధపడ్డానని, ఒక సన్నివేశాన్ని తీసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నానని స్పష్టం చేశారు. కెమెరా పెట్టి ఆ సీన్ తీయడానికి తనకు ఇష్టం లేదని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా బలవంతంగా చేయాల్సి వచ్చిందని చెప్పారు.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఎడిట్ సమయంలో బాగుంది అని చెప్పినా, తర్వాత ఎప్పటికీ అది తనను బాధించిందని, ఆ సీన్ లేకపోతే చదువు, మంచి కాన్సెప్ట్ ఉన్న ఆ సినిమా ఇంకా బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చెత్త సీన్ ఏమిటో చెప్పడానికి వినాయక్ నిరాకరించారు. సినిమాకు సంబంధించి పొరపాట్లు ఎడిటింగ్ రూమ్‌లో కాకుండా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తాయని వినాయక్ అభిప్రాయపడ్డారు. విడుదల తర్వాత వచ్చిన ఫలితం, విమర్శల ద్వారానే తమ తప్పులు తెలుస్తాయని అన్నారు. సినీ విమర్శలు, మీడియాలో వచ్చే రివ్యూల గురించి మాట్లాడుతూ, తాను వాటిని చదవనని చెప్పారు.  మొదట్లో బాధపడినా, ఇప్పుడు విమర్శలను చదవడాన్ని పూర్తిగా మానేశానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us