AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. శ్రీ సినిమాతో అడుగుపెట్టిన ఆయన, నటనకు మంచి మార్కులు అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి, అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈజీ డూయింగ్ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు.

Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 11:00 PM

Share
మంచు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. శ్రీ సినిమాతో అడుగుపెట్టిన ఆయన, నటనకు మంచి మార్కులు అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి, అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈజీ డూయింగ్ యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు. మనోజ్ యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ చిత్రాలను కూడా చేశారు. వాటిలో కొన్ని హిట్ టాక్‌ను అందుకోగా, మరికొన్ని యావరేజ్‌గా నిలిచాయి. ఆ చిత్రాలలో ఒకటి 2010లో విడుదలైన బిందాస్.

1 / 5
ఏకే ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించారు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలకు స్టోరీ అందించిన వీరు పోట్లకు దర్శకుడిగా ఇది తొలి సినిమా. కామెడీ యాక్షన్‌గా రూపొందిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా నటించారు. అయితే, ఈ చిత్రంలో మంచు మనోజ్‌కు జోడీగా నటించి, గిరిజ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముంబై భామ షీనా షాహాబాది.

2 / 5
షీనా షాహాబాది నేపథ్యం గురించి చూస్తే, ఆమె తల్లి బాలీవుడ్ ప్రముఖ నటి సాధనా సింగ్. తల్లి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది షీనా. తేరే సంగ్ అనే హిందీ చిత్రంలో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ భామకు బిందాస్ తొలి తెలుగు సినిమా. ఆ చిత్రం తర్వాత తొలిసారిగా చిత్రంలో నటించింది. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు మూవీలో కూడా కనిపించింది. ఇవే కాకుండా యాక్షన్ త్రీడీ, నువ్వే నా బంగారం, రాజశేఖర్ గెడ్డం గ్యాంగ్ వంటి చిత్రాల్లో నటించింది. 2015 తర్వాత షీనా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది.

3 / 5
 షీనా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే పెళ్లి చేసుకుంది. 2007లో వైభవ్ గోరే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అదే ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. తన జీవితంలో జరిగిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అంటూ ఒక ఇంటర్వ్యూలో షీనా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అక్కడితో ఆగిపోకుండా ఆ తర్వాత సినీ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించింది. తెలుగులో కనిపించనప్పటికీ, హిందీలో పలు టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే కన్నడలో యశ్ హీరోగా వచ్చిన రాజధాని చిత్రంలో కూడా నటించింది, ఇది తెలుగులో రాజధాని రౌడీగా డబ్ అయింది.

4 / 5
ప్రస్తుతం షీనా షాహాబాది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువవుతున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి, కుర్రకారును నిద్ర లేకుండా చేస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులను బట్టి చూస్తే, ఆమె మరొకరిని వివాహం చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీని లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఆమె ఇప్పటికీ అదే ఫిజిక్‌ను మెయింటైన్ చేయడం, చాలా స్టైలిష్‌గా కనిపించడం విశేషం. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఎంత బాగున్నాయో అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

5 / 5
Follow Us