AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి.. ఆ సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నాం

దివంగత ప్రముఖ నటుడు, దర్శకుడు ఏవీఎస్ కుమార్తె ఇటీవల తన తండ్రి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన, అంతగా తెలియని అంశాలను వెల్లడించారు. ఏవీఎస్ దర్శకత్వం వహించిన అంకుల్ సినిమా, దాని తర్వాత కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆమె వివరించారు.

ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి.. ఆ సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నాం
Avs
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2026 | 5:38 PM

Share

ఏవీఎస్ కుమార్తె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంకుల్ సినిమాను హీరో తరుణ్‌తో ఏవీఎస్ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏవీఎస్ చాలా పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టారని, అయితే అది భారీగా నష్టపోయిందని కుమార్తె తెలిపారు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తరుణ్ కుటుంబం నుంచి వచ్చిన కొన్ని మాటలు, స్టేట్మెంట్స్ డబ్బు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ బాధ కలిగించాయని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమా షూటింగ్ దశలో ఉంది. అంకుల్ సినిమా విడుదలైన తర్వాత నువ్వే కావాలి భారీ విజయం సాధించడంతో, అంకుల్ టైటిల్ అలాగే  తరుణ్ ఇమేజ్ సరిగా వాడుకోకపోవడం వల్ల నష్టం జరిగిందని కొందరు భావించారు. అయితే, ఏవీఎస్ తన కథపై ప్రగాఢ నమ్మకం ఉంచారని, దానిలో ఎటువంటి మార్పులు చేయకుండా ముందుకు వెళ్లారని, అది ఆయన స్వభావమని కుమార్తె స్పష్టం చేశారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండేవారని ఆమె అన్నారు.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

అంకుల్ సినిమా వల్ల కలిగిన ఆర్థిక నష్టాలు చాలా కాలం ఏవీఎస్‌ను వెంటాడాయని కుమార్తె వివరించారు. కేవలం అంకుల్ మాత్రమే కాకుండా, ఆ తర్వాత వచ్చిన ఓరి నీ ప్రేమ బంగారం గాను సినిమా వల్ల కూడా తీవ్ర నష్టాలు వచ్చాయని, రెండింటి కలిపి చూస్తే దాదాపు సంపాదించింది అంతా పోయి, కుటుంబం నెగటివ్ స్థితికి వెళ్లిందని ఆమె తెలిపారు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఏవీఎస్ లివర్ సమస్యలు ప్రారంభమైన సమయంతో కలిసి వచ్చాయని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

ఏవీఎస్ జీవితంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయనకున్న బంధం ప్రత్యేకమైనది. వారిద్దరి మధ్య మొదటి నుంచి మంచి అనుబంధం ఉండేదని, బాలసుబ్రహ్మణ్యం పాటలంటే ఏవీఎస్ కు పిచ్చి అని కుమార్తె చెప్పారు. రూమ్‌మేట్స్ అనే సినిమాలో ఎస్పీబీ ప్రత్యేక పాత్ర చేశారని, అందులో ఆయన వేరే సినిమాల పాటలు పాడుతూ ఆర్కెస్ట్రాగా నటించే షాట్లు కేవలం ఏవీఎస్ కోసం మాత్రమే చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఎస్పీబీని మొట్టమొదటిసారి కలిసిన సంఘటనను ఆమె వివరించారు. సారథి స్టూడియోలో, బాలు గారు మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, లుంగీ కట్టుకొని ఉన్న స్థితిలో ఏవీఎస్ తన కుమార్తెను ఆయన వద్దకు తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారని, వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక ఆర్టిస్ట్ కు ఇంకో ఆర్టిస్ట్ కు మధ్య కాదు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నంత సన్నిహితంగా ఉండేదని ఆమె తెలిపారు. వారు ఒకరినొకరు అన్నయ్య అని పిలుచుకుంటూ, తీరిక సమయాల్లో ఫోన్లలో మాట్లాడుకునేవారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us