AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దమ్ము దైర్యం ఉండాలి.. దేవతలతో పెట్టుకోకండి.. నాని ప్యారడైజ్ సినిమాపై వేణు స్వామి

దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘ది ప్యారడైజ్‌’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయిక. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయేల్, సోనాలి కులకర్ణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

దమ్ము దైర్యం ఉండాలి.. దేవతలతో పెట్టుకోకండి.. నాని ప్యారడైజ్ సినిమాపై వేణు స్వామి
The Paradise
Rajeev Rayala
|

Updated on: Sep 26, 2026 | 8:21 AM

Share

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు కేవలం కథ, కథనం, యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా.. వాటిలో ఉపయోగించే ఆధ్యాత్మిక అంశాలతోనూ కొన్నిసార్లు చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ‘ప్యారడైజ్’ సినిమాపై జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సినిమాలో ధూమావతి అమ్మవారి ప్రస్తావన, కాకి ప్రతీక, మంత్రోచ్ఛారణను పోలిన నేపథ్య సంగీతం వినిపించడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. దశమహావిద్యల్లో ఒకరిగా భావించే ధూమావతి అమ్మవారిని ‘ప్యారడైజ్’ చిత్రంలో ప్రత్యేకంగా చూపించారని వేణు స్వామి పేర్కొన్నారు పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మవారి వాహనంగా భావించే కాకిను సినిమాలో ఉపయోగించడం, అలాగే ఓ యాక్షన్ సన్నివేశంలో ధూమావతి అమ్మవారికి సంబంధించినదిగా పేర్కొంటున్న మంత్ర ధ్వనులను నేపథ్య సంగీతంలో వినిపించడం తన దృష్టిని ఆకర్షించిందని ఆయన చెప్పారు.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ధూమావతి అమ్మవారిని తంత్ర సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన దేవతగా భావిస్తారు. అలాంటి పవర్ ఫుల్ దేవతకు సంబంధించిన మంత్రాలు, ఆరాధనా విధానాలను సాధారణంగా తీసుకోవద్దని వేణు స్వామి పేర్కొన్నారు. ప్రత్యేకించి మంత్రోచ్ఛారణ, ఆవాహన వంటి అంశాలు సంప్రదాయ నియమాలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించాల్సిన విషయాలని అన్నారు. సినిమా షూటింగ్ లేదా నేపథ్య సంగీతం కోసం ఇలాంటి అంశాలను ఉపయోగించినప్పుడు కూడా వాటి ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని అర్థం చేసుకుని వ్యవహరించాలని వేణు స్వామి అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

నాని హీరోగా నటించిన ‘ప్యారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. సినిమాలోని కథా నేపథ్యానికి అనుగుణంగా పలు ప్రత్యేకమైన ప్రతీకలను, ఆధ్యాత్మిక అంశాలను దర్శకుడు ఉపయోగించారు. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది, ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.. ఈ మూవీలో నాని మాస్ అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్యారడైజ్ సినిమా తొలి రోజే భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకొని నాని కెరీర్ లో బిగెస్ట్ ఓపినింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us