హీరోయిన్‌ను బీట్ చేసేలా ఉందిగా..! ప్యారడైజ్‌లో నాని యంగ్ మదర్‌గా కనిపించిన టాలెంటెడ్ బ్యూటీ ఎవరంటే
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడగా.. తెరపై కనిపించిన పలువురు నటీనటులు, పాత్రలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది.

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని జడాల్ అనే విభిన్నమైన పాత్రలో కనిపించారు. యాక్షన్‌తో పాటు తల్లి, కొడుకుల ఎమోషన్‌కు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉందని చిత్రబృందం ప్రమోషన్స్‌లో చెప్పింది. తొలి రోజే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్యారడైజ్ సినిమాలో నాని తల్లి సమ్మక్క పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నటించారు. అయితే ఇదే పాత్రకు సంబంధించిన యంగ్ నాని మదర్ సన్నివేశాల్లో కనిపించిన నటి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆమె ఎవరు అంటూ నెటిజన్స్ తేగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు, అలాగే కొన్ని డీటైల్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె పేరు లావణ్య సహుకర.
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
లావణ్య సహుకర ఈ సినిమాలో నాని తల్లిగా కనిపించలేదు కానీ. సోనాలి కులకర్ణి పోషించిన సమ్మక్క పాత్రకు యంగ్ వెర్షన్‌లో లావణ్య నటించింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ‘ది ప్యారడైజ్’ చూసిన ప్రేక్షకులు.. తెరపై కనిపించిన ఈ అమ్మాయి ఎవరు.? అంటూ ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మక్క పాత్ర సినిమాలో కీలకమైన భావోద్వేగ కోణాన్ని కలిగి ఉండటంతో.. ఆమె యువ పాత్రను పోషించిన లావణ్యకు కూడా సినిమాలో ప్రాధాన్యం దక్కింది.
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి
లావణ్య సహుకర కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో పలు పాత్రలు చేసింది. 2019లో వచ్చిన ఉండిపోరాదే సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైందని తెలుస్తుంది. ఆ తర్వాత వాలెంటైన్స్ నైట్, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా 2023లో వచ్చిన అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో చైతన్య రావుతో కలిసి హీరోయిన్‌గా కనిపించింది. 2024లో ముఖ్య గమనిక అనే సినిమాలో విరాన్ ముత్తంశెట్టి సరసన ఆమె హీరోయిన్‌గా నటించింది. అదే ఏడాది కాడాది, సమిధ వంటి ప్రాజెక్టుల్లోనూ ఆమె కనిపించింది. తర్వాత వీరాపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి ప్రాజెక్టుల్లో కూడా భాగమైంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




