తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆమె తన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శించడంతో పాటు, షాపింగ్‌కు వెళ్తున్నానని ప్రకటించింది. ఈ వివరాలు తెలుసుకున్న దొంగలు కోటి రూపాయల నగదు, 110-115 సవర్ల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల గోప్యత ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.