AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా దృక్పథం: నిడదవోలు హృదయాలయంలో వొకేషనల్ సెంటర్ ప్రారంభం

నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) ప్రతినిధులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 20న నిడదవోలులోని హృదయాలయం ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల సందర్శించారు.

Anand T
|

Updated on: Sep 26, 2026 | 10:59 PM

Share
ఈ సందర్భంగా నూతన భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్ 4 స్పందన ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ భవనం 2026, ఆగస్టు 27న ప్రారంభమైంది. కాగా, ఈ నూతన భవన నిర్మాణానికి నాట్స్ 10,000 అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. ఈ పర్యటనలో కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ మానసిక వికలాంగులైన చిన్నారులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సులు, ఫిజియోథెరపీ సేవలను స్వయంగా పరిశీలించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి, కేంద్రంలోని సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం నాట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం ఇలాంటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

1 / 5
దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నాట్స్ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబు లకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కరికి రూ. 1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ రెండు దుకాణాలను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల చేతుల మీదుగా ప్రారంభించారు.

2 / 5
వెన్నెముకకు గాయాలై మంచానికే లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన బాధితులకు హోప్ 4 స్పందన ప్రతి నెలా అందిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా నాట్స్ అండగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. ఇందులో యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల అత్యవసర వస్తువులు ఉన్నాయి.

3 / 5
అలాగే, అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో శాశ్వత వసతి గృహాల ఏర్పాటుకు సైతం నాట్స్ తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ హోప్ 4 స్పందన ఆంధ్ర–తెలంగాణ కో-ఆర్డినేటర్ డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

4 / 5
నిడదవోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డాక్టర్ గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మి, దయ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ మంచి పనులకు విశేషంగా సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌