AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు గుడ్ న్యూస్.. డీజిల్ కాదు.. ఇథనాల్‌తో నడిచే ట్రాక్టర్ వచ్చేసిందోచ్ !!

దేశీయ ఆటోమొబైల్, వ్యవసాయ యంత్రాల దిగ్గజంగా "మహీంద్రా" గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో మరో కొత్త విప్లవానికి ఈ సంస్థ నాంది పలికింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న 'అగ్రోవిజన్ 2026' కార్యక్రమంలో తమ మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది.

రైతులకు గుడ్ న్యూస్.. డీజిల్ కాదు.. ఇథనాల్‌తో నడిచే ట్రాక్టర్ వచ్చేసిందోచ్ !!
Mahindra Flex Fuel Tractor
Korivi Jayakumar
|

Updated on: Nov 29, 2026 | 5:38 PM

Share

దేశీయ ఆటోమొబైల్, వ్యవసాయ యంత్రాల దిగ్గజంగా “మహీంద్రా” గుర్తింపు దక్కించుకుంది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో మరో కొత్త విప్లవానికి ఈ సంస్థ నాంది పలికింది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కంపెనీ కీలక అడుగు వేసింది. నాగ్‌పూర్ వేదికగా నవంబర్ 27 నుంచి 30 వరకు ‘అగ్రోవిజన్ 2026’ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తమ మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అగ్రోవిజన్ వేదికగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ప్రముఖుల సమక్షంలో మహీంద్రా ట్రాక్టర్స్ సీఈవో హర్ష్ రాయ్ ఈ సరికొత్త ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. డీజిల్‌కు బదులుగా పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో నడవడమే ఈ ట్రాక్టర్ ప్రధాన ప్రత్యేకతగా చెబుతున్నారు. దీనివల్ల రైతులకు ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు కాలుష్యం కూడా నియంత్రణలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో భారత మార్కెట్లో సంప్రదాయ డీజిల్ ట్రాక్టర్లకు ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా FADA గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మన దేశంలో అమ్ముడవుతున్న ట్రాక్టర్లలో ఏకంగా 99.96 శాతం డీజిల్ ఇంజిన్‌తో నడిచేవే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పెట్రోల్, ఇథనాల్ మిశ్రమంతో నడిచే ట్రాక్టర్‌ను తీసుకురావడం ద్వారా ఫ్యూచర్ టెక్నాలజీ వైపు మహీంద్రా గట్టి అడుగు వేసినట్లయింది. అలానే 49 హెచ్‌పీ సామర్థ్యంతో ‘యువో టెక్ ప్లస్’ (Yuvo Tech+) ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించడం గమనార్హం. ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలో మహీంద్రా చేస్తున్న పరిశోధనలకు ఈ కొత్త ట్రాక్టర్ నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ ట్రాక్టర్ ధర ఎంత? ఎప్పుడు లాంచ్ చేయనున్నారు? ఫీచర్స్ ? వంటి వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇథనాల్‌ తయారీ..

ఇథనాల్‌ను కేవలం చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, మొక్కజొన్న పొట్టు, పంట వ్యర్థాలు, వ్యవసాయ అవశేషాల నుంచి కూడా తయారు చేయవచ్చు. రైతులు పండించే పంటలతో పాటు వ్యవసాయ వ్యర్థాలను కూడా ఇంధన తయారీకి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టిన మహీంద్రా.. ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.

అగ్రోవిజన్‌లో ప్రదర్శించిన ఇతర మోడళ్లు..

నోవో 605 డీఐ పీఎస్ 4WD,,

50 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఈ ట్రాక్టర్ ఏకంగా 2,700 కిలోల బరువును ఎత్తగల లిఫ్ట్ కెపాసిటీతో వస్తోంది. ఇందులో పార్షియల్ సింక్రోమెష్ ట్రాన్స్‌మిషన్, 12/8 ప్యాడ్ క్లచ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఓజేఏ 2130 (OJA 2130)..

త్రీ-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్షన్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ ట్రాక్టర్ 950 కిలోల లిఫ్ట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని పీఆర్ఓజేఏ (PROJA) వేరియంట్లో 12 ఫార్వర్డ్, 12 రివర్స్ గేర్లతో పాటు స్మార్ట్ టెక్నాలజీ కోసం ‘డిజిసెన్స్’ (DigiSense) కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు.

Follow Us
రైతులకు గుడ్ న్యూస్.. డీజిల్ కాదు.. ఇథనాల్‌తో నడిచే ట్రాక్టర్ !!
రైతులకు గుడ్ న్యూస్.. డీజిల్ కాదు.. ఇథనాల్‌తో నడిచే ట్రాక్టర్ !!
లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు దూరమవుతున్న స్టార్ హీరోలు
లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలకు దూరమవుతున్న స్టార్ హీరోలు
గంభీర్, గిల్‌తో సిరాజ్‌కు విభేదాలా?
గంభీర్, గిల్‌తో సిరాజ్‌కు విభేదాలా?
మటన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? ఎవరు తినాలి.. ఎవరు తినకూడదో
మటన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? ఎవరు తినాలి.. ఎవరు తినకూడదో
రాజకీయాల్లోకి షమీ..! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ
రాజకీయాల్లోకి షమీ..! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో భేటీ
శీతాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా కాపాడే చిట్కాలు!
శీతాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా కాపాడే చిట్కాలు!
డిసెంబర్‌లో ఈ తేదీల్లో పుట్టినవారికి అదృష్టం కలిసొస్తుందా?..
డిసెంబర్‌లో ఈ తేదీల్లో పుట్టినవారికి అదృష్టం కలిసొస్తుందా?..
ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా కరకరలాడే ఆంధ్రా స్టైల్ చేపల వేపుడు
ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా కరకరలాడే ఆంధ్రా స్టైల్ చేపల వేపుడు
నా కష్టసుఖాలు ఆయనతో చెప్పుకునేవాడిని..
నా కష్టసుఖాలు ఆయనతో చెప్పుకునేవాడిని..
ఈ ఐదు ఫుడ్స్ మీ డైట్‌లో ఉంటే.. కంటి ఆరోగ్యానికి డోకా లేనట్టే
ఈ ఐదు ఫుడ్స్ మీ డైట్‌లో ఉంటే.. కంటి ఆరోగ్యానికి డోకా లేనట్టే