పెట్రోల్ డీజిల్
పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేసే పెట్రోల్, డీజిల్ ఇంధనం అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఇది అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఇంధనం కావడం విశేషం. ఆధునిక రవాణా వ్యవస్థలతో పాటు పరిశ్రమలు, వ్యవసాయంలో ఈ ఇంధనాన్ని వాడుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఎక్కువ వాహనాలు, యంత్రాలు పెట్రోల్ లేదా డీజిల్‌తోనే నడుస్తున్నాయి. దీని ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలపై ఆధారపడి మారుతుంటాయి. గ్లోబల్ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్-డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి పెట్రోల్-డీజిల్ విక్రయాలపై విధించే పన్నులు పెద్ద వనరుగా ఉంది. పెట్రోల్-డీజిల్‌పై విధించే పన్నులలోని అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుతుంది.
భారతదేశంలో సాధారణంగా డీజిల్‌తో పోలిస్తే పెట్రోల్‌పై ఎక్కువ పన్నులు విధించబడుతాయి. అందువల్ల పెట్రోల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా చల్లని దేశాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దీని ఇగ్నిషన్ ఇతర ఇంధనాల కంటే సులభంగా జరుగుతుంది. కార్లు, బైక్‌లు వంటి తేలికపాటి వాహనాల్లో తక్కువ బరువు కలిగిన పెట్రోల్‌ను అధికంగా వినియోగిస్తారు. పెట్రోల్ కంటే ఎక్కువ భారంగా ఉండే డీజిల్‌ను ట్రక్కులు, ట్రాక్టర్లు, బస్సులు, జనరేటర్లు వంటి భారీ యంత్రాల్లో వాడుతారు.
ఇంకా చదవండిPetrol: పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం బిగ్ డెసిషన్.. ట్యాక్సుల్లో మార్పులు.. నేటి నుంచే అమలు..
పెట్రోల్, డీజిల్ ట్యాక్సుల విషయంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాలను మార్చుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అస్ధిరతతో ఉంటున్నాయి. దీంతో కేంద్రం ఆ ధరలను పరిగణలోకి తీసుకుని ట్యాక్సులు సవరిస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Oct 16, 2026
- 12:46 pm
Petrol Prices: దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పండక్కి ముందే షాక్.. ఒకేసారి ఎంతంటే..?
దేశ ప్రజలకు బ్యాడ్ న్యూస్. దసరా పండక్కి ముందే షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 మేర పెరిగాయి. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. సామాన్యులపై ఇది భారంగా చెప్పవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Oct 3, 2026
- 7:59 pm
Petrol: పెట్రోల్ బంక్‌లో ఈ నంబర్ గమనించారా? మీ వాహనం మైలేజీకి దీనికి సంబంధం ఏమిటి?
Petrol: పెట్రోల్ సాంద్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఆ పెట్రోల్ కల్తీ చేసినట్లు అర్థం అని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల తప్పుడు సాంద్రత లేదా కల్తీ ఇంధనం కారణంగా మీ వాహనం మైలేజ్ తగ్గుతుంది. ఇది కాకుండా ఎక్కువ కాలం పాటు నాణ్యత లేని..
- Subhash Goud
- Updated on: Sep 20, 2026
- 7:24 am
Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు.. ఎంత తగ్గిందంటే..!
Petrol, Diesel: పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ లభ్యతను కాపాడటం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతులను నియంత్రించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ ఎగుమతి లెవీలను అమలు చేస్తోంది. 2026 మార్చి 27 నుంచి ఈ ఎగుమతి లెవీల విధానం అమల్లోకి వచ్చింది..
- Subhash Goud
- Updated on: Sep 17, 2026
- 8:25 am
చుక్కలను తాకుతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 నష్టం..!
మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు దాటడంతో భారత్‌పై ఇంధన దిగుమతుల భారం పెరుగుతోంది. ICRA అంచనాల ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు సగటున రూ.5, డీజిల్‌పై రూ.23 వరకు ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తోంది. చమురు ధరలు మరింత పెరిగితే ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Sep 10, 2026
- 9:28 am
100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై పశ్చిమాసియా సంక్షోభం..!
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థపై, స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇంధన దిగుమతి భారం పెరిగి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఎగుమతుల క్షీణత వంటి సమస్యలతో భారత ఎకానమీ ఒత్తిడికి లోనవుతోంది.
- Balaraju Goud
- Updated on: Sep 9, 2026
- 9:37 pm
Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాలపై సమీక్ష నిర్వహిస్తూ ఉంది. వీటిల్లో సవరణలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజా సమీక్షలో మరోసారి ట్యాక్సులను పెంచింది. వీటిని విండ్ ఫాల్ ట్యాక్సుగా పిలుస్తారు.
- Venkatrao Lella
- Updated on: Sep 1, 2026
- 9:59 pm
Petrol Pump Profit: పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత? నెలకు అసలు లాభం ఎంత?
Petrol Pump Profit: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్ పంప్ యజమానులకు (డీలర్లకు) ప్రతి లీటరు అమ్మకంపై నిర్ణీత కమిషన్ (Dealer Commission) అందిస్తాయి. పెట్రోల్‌పై డీలర్‌కు మంచి కమిషన్ లభిస్తుంది. పెట్రోల్ పంప్ అనేది "తక్కువ మార్జిన్ - ఎక్కువ విక్రయాలు..
- Subhash Goud
- Updated on: Aug 27, 2026
- 1:27 pm
Petrol Pump: వాహనంలో పెట్రోల్ వేయిస్తున్నారా? పంపు మీటర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?
Petrol Pump: పెట్రోల్ పంపు డిస్పెన్సర్, నాజిల్‌పై ప్రభుత్వ శాఖ ముద్ర ఉండాలి. ఒకవేళ ఆ ముద్ర అరిగిపోయినట్లుగా కనిపిస్తే, ఆ యంత్రాన్ని ఎవరో తారుమారు చేశారనడానికి అది ఒక సంకేతం. కొన్నిసార్లు, నాజిల్‌లో చిన్న అయస్కాంతాలు ఉంటాయి. దీనివల్ల ఇంధనం తక్కువగా ప్రవహిస్తుంది..
- Subhash Goud
- Updated on: Aug 15, 2026
- 8:05 pm
Fuel Price: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. నిరుపేదల కోసం సెస్ పెంపు.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Fuel Price: ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, 2026ను శాసనసభలో ఆమోదించింది. ఈ సవరించిన చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్టంగా రూ. 5 పన్ను విధించే అధికారాన్ని కల్పిస్తుంది. దీనిని వితంతువులు, నిరుపేదల సంక్షేమం కోసం..
- Subhash Goud
- Updated on: Aug 12, 2026
- 6:39 pm
మన దేశంలో తొలి పెట్రోల్ బంక్ ఎక్కడ పెట్టారు? అప్పట్లో రూపాయికి ఎన్ని లీటర్లో తెలుసా?
భారత్‌లో తొలి పెట్రోల్ బంక్ 1928లో ప్రారంభమైంది. దీన్ని బర్మా షెల్ నిర్వహించింది. అప్పట్లో పెట్రోల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. మరి అప్పట్లో పెట్రోల్ ధర ఎంత? ఒక రూపాయికి ఎన్ని లీటర్లు వచ్చేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
- SN Pasha
- Updated on: Aug 12, 2026
- 1:19 pm
Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ దిగొస్తున్నాయి. దీంతో కేంద్రం తగ్గింపుపై క్లారిటీ ఇచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Aug 11, 2026
- 8:50 am