AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ దిగొస్తున్నాయి. దీంతో కేంద్రం తగ్గింపుపై క్లారిటీ ఇచ్చింది.

Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?
Petrol
Venkatrao Lella
|

Updated on: Aug 11, 2026 | 8:50 AM

Share

పెట్రోల్, డీజిల్ ధరలను ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, గల్ప్ దేశాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొనడం, ముడి చమురు ధరలు దిగిరావడంతో ఇంధన ధరలను త్వరలో తగ్గించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాహనదారులు కూడా తగ్గింపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ప్రత్యక్ష్యంగా ఏమీ లేదని, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని పేర్కొంది.

ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయా? అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయమంత్రి సురేష్ గోపి స్పందించారు. ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదన్న ఆయన.. ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని అన్నారు. భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల అనేది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. పొరుగు దేశాల కంటే భారత్‌లోనే చౌకగా లభిస్తుందన్నారు. ముడి చమురు ధరల్లో అస్థిరత ఉన్నప్పటికీ.. జూన్ 2021 నుంచి జూన్ 2026 మధ్య దేశంలోనే ధరలు పెరుగుదల తక్కువగా ఉందని స్పష్టం చేశారు. అమెరికాలో పెట్రోల్ ధరలు 70.6 శాతం, జర్మనీలో 51.1 శాతం, యూకేలో 46.9 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌లో 59.9 శాతం, పాకిస్తాన్లో 160.6 శాతం, శ్రీలంకలో 148.6 శాతం, నేపాల్‌లో 75 శాతం పెరిగాయన్నారు. కానీ భారత్‌లో పెట్రోల్ ధర 8.1 శాతం, డీజిల్ ధర 11.5 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

ఎక్సైంజ్ సుంకం తగ్గింపు

ఇక పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.10 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. దీని వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చగా.. ప్రభుత్వ పన్ను రాబడి కూడా తగ్గిందని తెలిపింది. ప్రభుత్వం ధరల్లో ఇప్పుడు ఎలాంటి కొత్త తగ్గింపును ప్రకటించలేదని సురేష్ గోపి స్పష్టం చేశారు. కాగా ఫిబ్రవరి 28న ఇరాన్-అమెరికా వార్ మొదలవ్వగా.. ఆ తర్వాత నాలుగుసార్లు కేంద్రం ధరలను పెంచింది. ఏప్రిల్ 16న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై రూ.3 పెంచగా.. మే 19న లీటర్‌కు రూ.0.09, మే 15న లీటర్‌పై రూ.4.74, డీజిల్‌పై రూ.4.82 చొప్పున పెరిగింది.

Follow Us
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత