AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?

PM Kisan Installment: తమ తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇ-కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి అని గుర్తించుకోండి. అలాగే..

PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?
Pm Kisan Update
Subhash Goud
|

Updated on: Oct 13, 2026 | 3:32 PM

Share

PM Kisan Installment: కేంద్ర ప్రభుత్వం దేశ రైతుల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ ఒకటి. ఇప్పటి వరకు 23వ విడత డబ్బులు అందుకున్న రైతులు ఇప్పుడు 24వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు సమాధాన వాయిదాలలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ విడతలను సాధారణంగా ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో పంపిణీ చేస్తారు.

దీని ప్రకారం, ఆగస్టు-నవంబర్ కాలానికి సంబంధించిన వాయిదా కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌లో దుర్గా పూజ పండుగ కూడా వస్తుంది. అందుకే ప్రభుత్వం పండుగకు ముందే వాయిదాను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: MDR Charges: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం.. యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా

ఇవి కూడా చదవండి

గత కొన్నేళ్లుగా విడుదల తేదీలను పరిశీలిస్తే..

  • 18వ వాయిదా – అక్టోబర్ 5, 2024
  • 19వ విడత ఫిబ్రవరి – 24, 2025
  • 20వ విడత – ఆగస్టు 2, 2025
  • 21వ వాయిదా – నవంబర్ 19, 2025
  • 22వ వాయిదా – మార్చి 13, 2026
  • 23వ వాయిదా- జూన్ 20, 2026

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 2024లో 18వ విడత దుర్గా పూజకు ముందు అక్టోబర్ 5, 2024న విడుదల చేశారు. అంటే రైతులు పండుగ సీజన్‌లో డబ్బు అందుకున్నారు. అందువల్ల ఈసారి కూడా పీఎం కిసాన్ 24వ విడత దుర్గా పూజకు ముందే విడుదల అవుతుందని లబ్ధిదారులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ విడత విడుదలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గత విడుదలైన విడత డబ్బుల ఆధారంగా పండగకు ముందు విడుదల కావచ్చని రైతులు భావిస్తున్నారు.

రైతులు ఏమి చేయాలి?

తమ తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇ-కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి అని గుర్తించుకోండి. అలాగే మీ బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానించబడిందో లేదో, మీ భూమి సమాచారం సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి.

ఇది కూడా చదవండి: Ceiling Fan: వోల్టేజ్ సరిగ్గానే ఉన్నా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోందా? ఈ 6 కారణాలు తెలుసుకోండి!

ఇది కూడా చదవండి: యూజర్లకు Airtel అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్, 5జీ డేటా బెనిఫిట్స్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us