AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali Pre Release Event: విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ ప్రేమకథ చేయాలని ఉంది.. రష్మిక మందన్న కామెంట్స్..

రణబాలి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, చిత్ర బృందం కష్టాన్ని చెప్పుకొచ్చారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ విజన్‌ను ప్రశంసించారు. రణబాలి కేవలం ప్రేమకథ కాదని, ఓ గొప్ప అనుభూతి అని తెలిపారు. విజయ్ దేవరకొండ నటనను ప్రత్యేకంగా అభినందించారు.

Ranabaali Pre Release Event: విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ ప్రేమకథ చేయాలని ఉంది.. రష్మిక మందన్న కామెంట్స్..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Oct 13, 2026 | 10:49 PM

Share

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నోసార్లు స్టేజ్ ఎక్కినా ప్రతిసారి గుండె దడ పెరుగుతుందని, అయితే అభిమానుల ప్రేమ తనను ముందుకు నడిపిస్తుందని రష్మిక తెలిపారు. జయమ్మ, రణబాలి లుక్‌లో అభిమానులు చేస్తున్న రీల్స్, పోస్ట్‌లు, కామెంట్‌లు, స్టోరీలను చూసి ఎంతగానో మురిసిపోయినట్లు రష్మిక పేర్కొన్నారు. “మీ రీల్స్ చూస్తుంటే నా సమయం తెలియకుండానే గడిచిపోతుంది. మీరు చాలా ముద్దుగా ఉన్నారు, ఐ లవ్ యూ ఆల్” అని అభిమానులను ఉద్దేశించి అన్నారు. రణబాలి సినిమా సెట్‌లో పని చేయడం గురించి రష్మిక మాట్లాడుతూ, “ఒక్కొక్క రోజు ఒక ఫోర్, ఫైవ్ డేస్ షెడ్యూల్ ఉంటుంది. మిగతా వాళ్ళు వన్, టూ మంత్స్ కంటిన్యూస్‌గా పని చేస్తుంటారు. నేను నాలుగైదు రోజులు వెళ్లి మళ్ళీ వస్తాను. నాకు సెట్‌కి వెళ్ళడానికి ఎంత భయమేస్తుందంటే, అందరూ ఎంత సీరియస్‌గా పని చేస్తుంటారు” అని తెలిపారు. విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “విజయ్ అయితే మీసాలు తిప్పుతూ ఆ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే భయమేస్తుంది” అని అన్నారు. మొత్తం కాస్ట్, క్రూ అత్యంత కఠినమైన వాతావరణంలో, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో పనిచేశారని, వారి కృషి వెలకట్టలేనిదని రష్మిక చెప్పుకొచ్చారు.

రణబాలి చిత్ర బృందం ఎంత ప్రేమతో, అభిరుచితో ఈ చిత్రాన్ని నిర్మించిందో ఆమె వివరించారు. “నేను మొదటి ఆడియన్స్ అని మీకు చెబుతున్నాను. అక్టోబర్ 16న విడుదలవుతున్న రణబాలి చూస్తే మిమ్మల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు. అది నేను హామీ ఇస్తున్నాను” అని రష్మిక అన్నారు. తాను ఇంకా సినిమా చూడలేదని, అభిమానులతో పాటే మొదటి రోజు చూస్తానని తెలిపారు. టీమ్ మొత్తాన్ని చూస్తుంటే, వారు ఒక గాడ్ మోడ్లో పనిచేశారనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌ను ఉద్దేశించి రష్మిక మాట్లాడుతూ, “నేను ఒక సినిమా చేయాలంటే అది నా కోసం దేవుడు రాసిపెట్టిన సినిమా అని నమ్ముతాను. చాలా సినిమాలు చేయాలని అనిపిస్తుంది కానీ డేట్స్ వర్క్ కావు, కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమా వచ్చినప్పుడు నాకు అనిపించింది, నేను ఈ సినిమా చేసినందుకు చాలా కృతజ్ఞురాలిని. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సినిమా” అని అన్నారు.

విజయ్ దేవరకొండతో కలిసి గతంలో చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ అందమైన ప్రేమకథలని, అయితే రణబాలి ప్రేమకథ కాదని రష్మిక స్పష్టం చేశారు. ఇందులో ప్రేమ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని, కానీ రణబాలి ఒక ప్రేమకథకు మించి చాలా పెద్ద సినిమా అని వివరించారు. భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ ప్రేమకథ చేయాలని ఉందని తెలిపారు. తన పాత్ర “జయమ్మ” గురించి మాట్లాడుతూ, రాహుల్ సర్‌తో నరేషన్ వింటున్నప్పుడు, జయమ్మ అనేది రాహుల్ సార్ అమ్మగారి పేరని తెలిసి తాను మెల్ట్ అయిపోయానని రష్మిక ఉద్వేగంగా చెప్పారు. “ఇది ఇప్పుడు చేయకపోతే ఎలా అనిపించింది. షి ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. జయమ్మ అనే క్యారెక్టర్ మనసులో ఉండిపోతుంది. ఈ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని అన్నారు. సంగీత దర్శకులు అజయ్-అతుల్‌కు ప్రాణాంతకమైన సంగీతం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు, తాను వారికి పెద్ద అభిమానినని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ను తన హోమ్ ప్రొడక్షన్ అని అభివర్ణిస్తూ, వారితో మరిన్ని క్రేజీ సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. చివరిగా, విజయ్ దేవరకొండ పని పట్ల తాను పెద్ద అభిమానిని అని, రణబాలిలో ఆయన చేసిన పనిని చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని రష్మిక అన్నారు.

Follow Us