AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?

హోం లోన్ తీసుకున్న వారికి EMI ఎంత పెరగనుంది?

Samatha J
|

Updated on: Oct 13, 2026 | 12:03 PM

Share

సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో హోమ్ లోన్ ఈఎంఐలు పెరగనున్నాయి. 50 లక్షల లోన్‌పై నెలకు ₹780 అదనపు భారం పడనుంది. బ్యాంకులు ఈఎంఐ లేదా కాలపరిమితిని పెంచే అవకాశం ఉంది. ప్రీపేమెంట్స్‌తో భారం తగ్గించుకోవచ్చు.

సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి షాకిచ్చింది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. లోన్ వడ్డీతో రెపో రేటు అనుసంధానించి ఉండటంతో, ఈ పెంపు బ్యాంకులు ఇచ్చే వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో రుణగ్రహీతలపై నేరుగా ఈఎంఐ భారం పడనుంది.ముఖ్యంగా హోమ్ లోన్లు వంటివి ఫ్లోటింగ్ రేట్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ అయిన రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. ఆర్బీఐ నిర్ణయం వల్ల 50 లక్షల హోమ్ లోన్ ను 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నవారికి నెలకు అదనంగా 780 రూపాయల వరకు ఈఎంఐ భారం పడనుంది. ఈ నిర్ణయం సామాన్య మధ్యతరగతి ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.అయితే, బ్యాంకులు రుణగ్రహీతలకు రెండు ఆప్షన్లు ఇచ్చే వీలుంది: ఒకటి నెలవారీ ఈఎంఐ పెంచడం లేదా లోన్ కాలపరిమితిని పొడిగించడం.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Follow Us