హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్ వాసులకు తీవ్ర హెచ్చరిక. వేసవిలోనే కాకుండా, డిసెంబర్ నుంచే నగరానికి నీటి ఎద్దడి తప్పదని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. సింగూర్, మంజీరా జలాశయాలు అడుగంటుతున్నాయి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నా, పౌరులు నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ నగరవాసులకు తీవ్ర హెచ్చరిక. వేసవిలో ఎదురయ్యే నీటి కష్టాలు ఈసారి డిసెంబర్ నుంచే ప్రారంభమయ్యే అవకాశముందని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయిలో పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై కనిపిస్తోంది. వాటర్ ట్యాంకర్ల బుకింగ్‌లు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయి. నగరానికి ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన సింగూర్ జలాశయం సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 3.9 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇది 60 రోజుల్లో అంటే డిసెంబర్ మధ్య నాటికి ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉస్మాన్‌సాగర్ నిల్వలు కూడా పడిపోయాయి. సింగూర్, మంజీరా ఆధారిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై వాటర్ బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవడం అనివార్యమని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!

