భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా!
కర్ణాటకలోని హరగి గ్రామం అప్పుల నివారణకు అద్భుత నిర్ణయం తీసుకుంది. ఖరీదైన వివాహ మాంసాహార విందులను నిషేధించింది. నిబంధనను ఉల్లంఘిస్తే విందు ఏర్పాటు చేసిన వారికి లక్ష, హాజరైన వారికి 50,000 జరిమానా విధిస్తారు. రైతులు రుణభారంతో కుంగిపోకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా, శికారిపుర తాలూకా పరిధిలోని హరగి గ్రామం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణమవుతున్న అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక కఠినమైన, వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది.గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ, వివాహం తర్వాత ఇచ్చే ఖరీదైన మాంసాహార విందును పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ ఎవరైనా విందు ఏర్పాటు చేస్తే వారికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, ఆ విందుకు హాజరైన వారికి 50,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు.గ్రామంలోని అన్ని కులాలకు చెందిన సుమారు 360 కుటుంబాలు స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద సమావేశమై ఈ నిబంధనను ఆమోదించాయి. వరుస కరువు పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయారని గ్రామ పెద్దలు తెలిపారు. అయినప్పటికీ, సామాజిక గౌరవం కోసం భారీ విందులు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, దీనివల్ల కుటుంబాలు రుణభారంతో కుంగిపోతున్నాయని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

