9 రాష్ట్రాలు, 4,154 కి.మీ.. దేశంలో అత్యంత ఎక్కువదూరం ప్రయాణించే రైలు ఇదే..
Venkatrao Lella
Images: Pinterest
13 OCT 2026
భారతదేశంలో అనేక పొడవైన రైలు మార్గాలు ఉన్నాయి. కొన్ని రైళ్లు సదూర ప్రాంతాలకు వెళ్తుంటాయి. అయితే అత్యంత పొడవైన ప్రయాణాన్ని అందించే రైలు ఏంటనేది చూద్దాం.
దేశంలో అత్యంత పొడవైన రైలు జర్నీ అందించే ట్రైన్ వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు ఏకంగా 4,155 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల మీదుగా వెళ్తుంది.
అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు ఈ రైలు ప్రయాణం సాగిస్తుంది. సుమారు 75 గంటల సమయం ఆ రెండు ప్రాంతాల మధ్య జర్నీకి పడుతుంది.
ఈ ప్రయాణం భారతీయ రైల్వేల విస్తృతిని, ఇంజనీరింగ్ అద్భుతాలను చాటి చెబుతుంది. దేశంలోని తూర్పు చివర నుండి దక్షిణ చివర వరకు ఈ రైలు వెళ్తుంది. వివిధ భౌగోళిక ప్రాంతాలను, సంస్కృతులను కలుపుతుంది.
వివేక్ ఎక్స్‌ప్రెస్ అనేది కేవలం ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు. ఇది భారతదేశ వైవిధ్యాన్ని, అందాలను దగ్గర నుండి చూసే ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ రైల్లో ప్రయాణించేవారు మంచి అనుభూతిని పొందవచ్చు.
ఈ రైలు అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, కేరళ వంటి రాష్ట్రాలను కవర్ చేస్తూ పయనిస్తుంది. ఇది భారతీయ రైల్వేల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
భారతీయ రైల్వే వ్యవస్థలో వివేక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2011-12 రైల్వే బడ్జెట్‌లో అప్పుడు రైల్వేమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ దీనిని ప్రకటించారు. 2013లో స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఈ రైళ్లకు వివేక్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు.
వివేక్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 55 స్టాప్‌లలో ఆగుతుంది. సగటు వేగం 51 కిలోమీటర్లుగా ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లల్లో 24వ స్థానంలో ఉంది.