ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ దిమ్మతిరిగే కౌంటర్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇండియా పీఎం అంబానీనా? అంటూ చేసిన వ్యాఖ్యలకు కమల్ హాసన్ దీటుగా బదులిచ్చారు. ఏ బిలియనీర్ కూడా దేశ విధానాలను నిర్దేశించలేరని స్పష్టం చేశారు. కమల్ కౌంటర్‌కు నటి కంగనా రనౌత్ కూడా మద్దతు పలికారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇండియా పీఎం అంబానీనా? అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్సింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై మస్క్ సోషల్ మీడియాలో స్పందించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ దీటుగా బదులిచ్చారు. ఏ బిలియనీర్ అయినా, అది భారతీయుడైనా, అమెరికన్ అయినా దేశ విధానాలను నిర్దేశించలేరని స్పష్టం చేశారు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడే పాశ్చాత్య దేశాలు కూడా రక్షణాత్మక విధానాలను పాటిస్తున్నాయని కమల్ హాసన్ విమర్శించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా 100 శాతం సుంకాలు విధించి తన దేశీయ పరిశ్రమను కాపాడుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా భారత్ కూడా తన దేశీయ తయారీ రంగాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

