నో కాస్ట్ ఈఎంఐ వెనుక అసలు మోసం.. ఇది ఎవరూ చెప్పరు..

Venkatrao Lella

Images: Pinterest

12 OCT 2026

ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసేవారికి నో కాస్ట్ ఈఎంఐ గురించి తెలిసే ఉంటుంది.. ఈ సదుపాయం ద్వారా ఈఎంఐ రూపంలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు ఎలాంటి వడ్డీ భారం ఉండదు. కానీ వడ్డీకి బదులుగా వేరే రూపంలో ఛార్జీలు వినియోగదారులపై వేస్తారు.

నో-కాస్ట్ ఈఎంఐలో వడ్డీ భారాన్ని తయారీదారులు లేదా విక్రేతలు భరిస్తారు. పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను విక్రయించడం ద్వారా లభించే లాభంలో వడ్డీని భరిస్తారు. దీంతో దీని వల్ల తమకు వడ్డీ ఉండదని కొనేవారు భావిస్తారు.

అయితే క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే భారీ రాయితీలు పొందవచ్చు. కానీ నో కాస్ట్ ఈఎంఐని ఎంచుకున్నప్పుడు ఈ ఆఫర్లు వర్తించవు. దీని వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది.

వడ్డీ భారం వస్తువు ధరలోనే కలిపి ఉంటుంది. రూ.లక్ష ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తుంటే.. 12 శాతం వడ్డీ రేటుతో ఆరు నెలల వాయిదాలు చెల్లిస్తే మొత్తం రూ.6 వేలు వడ్డీ అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐలో రూ.6 వేలు వడ్డీని ల్యాప్‌టాప్ ధరలో కలిపి మొత్త రూ.లక్ష ఆరు వేల  పేర్కొంటారు.

వడ్డీని విడిగా చూపించనప్పటికీ.. అది వస్తువు ధరలో భాగమై ఉంటుంది. వినియోగదారుడు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని చాలామంది గమనించరు.

అయితే ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు.. ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి డబ్బులు ఉండవు. ఇలాంటి సమయంలో నో-కాస్ట్ ఈఎంఐ ఒక మంచి ఎంపికకు చెప్పవచ్చు.

క్రెడిట్ కార్డు ఈఎంఐలకు తరచుగా అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. నో కాస్ట్ ఈఎంఐ వల్ల అసలు నష్టం అనేది ఉండదు. అయితే అదనపు ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్టీ వంటివి ఉంటాయి. ఈ ఛార్జీల భారం తప్పదు.

నో కాస్ట్ ఈఎంఐ వల్ల వడ్డీ ఒక్కటి మాత్రమే పడదు. కానీ క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసినందుకు ప్రాసెసింగ్ ఫీజులు, అదనపు ఛార్జీలు వంటివి దాగి ఉంటాయి. వీటి ద్వారా అదనపు ఛార్జీలు పడతాయి.

నో కాస్ట్ ఈఎంఐ ద్వారా ఏదైనా కొనేటప్పుడు నియమ, నిబంధనలు తెలుసుకోండి. ఒకసారి షరతులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోండి. దీని ద్వారా మీకు స్పష్టత వస్తుంది.