AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే

రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే

Samatha J
|

Updated on: Oct 13, 2026 | 12:02 PM

Share

రష్యాలో ప్లేగు వ్యాధి ప్రబలుతోందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. సైబీరియాలోని ఒక ల్యాబ్ నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీక్ అయి పరిశోధకురాలు మృతిచెందారనే కథనాలు వెలువడ్డాయి. అయితే, రష్యా ప్రభుత్వం ఈ వార్తలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిస్థితిని సమీక్షిస్తోంది.

రష్యాలో ప్లేగు వ్యాధి తీవ్రంగా ప్రబలుతోందంటూ వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న షిపిలోవా అనే మహిళా పరిశోధకురాలు ఇటీవల ప్రాణాలు కోల్పోవడం ఈ కలకలానికి ప్రధాన కారణమైంది. ల్యాబ్ నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీకై ఆమె మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన మరవకముందే రష్యాలో ఇదే వ్యాధితో మరో వ్యక్తి కూడా మరణించారని కొన్ని సోషల్ మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఊహాగానాలపై రష్యా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. రష్యాలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. మీడియాలో వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేల్చి చెప్పారు. అవసరమైన వైద్య విభాగాల నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Follow Us