హైదరాబాద్లోని కూకట్పల్లి బాబుగూడలో ప్రేమ పేరుతో దారుణం జరిగింది. ప్రియుడు అశ్విన్ తన ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి సోదరిపైనా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో యువతి మృతి చెందగా, సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు అశ్విన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.