AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabaali Grand Pre Release Event : రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి చూపు విజయ్, రష్మిక పైనే..

టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత విజయ్, రష్మిక జోడిని వెండితెరపై చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్లలో భాగంగా రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్.

Rajitha Chanti
|

Updated on: Oct 13, 2026 | 6:35 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా రణబాలి. దసరా కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ అక్టోబర్ 16న విడుదల కానుంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో మరో మూడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్ హోరెత్తిస్తున్న మేకర్స్, హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఇప్పటికే ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ వేడుకను మీరు టీవీ9లో ప్రత్యేక్ష ప్రసారంలో చూడొచ్చు.

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

Follow Us