E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన!
E20 Petrol: కొత్తగా వచ్చే దాదాపు అన్ని వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగానే తయారవుతున్నాయి. పాత వాహనాలు ఉన్నవారు క్రమం తప్పకుండా టైమ్ టు టైమ్ వెహికల్ సర్వీసింగ్ చేయించుకోవడం, ఫ్యూయల్ ఫిల్టర్లను తనిఖీ చేసుకోవడం ద్వారా వాహన పనితీరును మెరుగ్గా..

E20 Fuel: మారుతున్న పర్యావరణ పరిస్థితులు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా పెంచుతోంది. అయితే, 20% ఇథనాల్ కలిపిన ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల ఇంజిన్ పాడైపోతుందేమోనని, మైలేజ్ పడిపోతుందేమోనని వాహనదారులు, ముఖ్యంగా పాత వాహనాలు ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళనను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ ఆందోళనలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, పాత వాహనాలపై E20 పెట్రోల్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశంపై స్పష్టతనిచ్చింది.
ఇది కూడా చదవండి: WhatsApp Hack: ఈ 4 సెట్టింగ్‌లు ఎనేబుల్ చేయకపోతే మీ వాట్సాప్ హ్యాక్ కావచ్చు.. జాగ్రత్త..!
మైలేజ్‌పై ప్రభావం ఎంత?
కేంద్ర ప్రభుత్వ నివేదికలు, పరిశోధనల ప్రకారం.. మైలేజ్ స్వల్పంగా తగ్గుతుంది. E20 పెట్రోల్ వాడటం వల్ల పాత వాహనాల్లో (E20 నిబంధనలకు ముందు తయారైనవి) మైలేజ్ దాదాపు 1% నుండి 5% వరకు తగ్గే అవకాశం ఉంది. ఇందుకు కారణాలు ఉన్నాయి. ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ (శక్తి సామర్థ్యం) సాధారణ పెట్రోల్ కంటే కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంధన వినియోగం స్వల్పంగా పెరిగి మైలేజ్‌లో చిన్నపాటి వ్యత్యాసం కనిపిస్తుందని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ఇంజిన్ పాడవుతుందా?
- అలాగే E20 పెట్రోల్‌తో వాహనం ఇంజిన్ పాడువుతుందని కూడా అపోహ ఉంది. దీనిపై కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. పాత వాహనాల్లో E20 వాడితే ఇంజిన్ పూర్తిగా దెబ్బతింటుందనే ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- భారీ నష్టం ఉండదు: E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లలో ఎటువంటి పెద్ద ఎత్తున లేదా తీవ్రమైన నష్టం (Widespread Engine Damage) జరగదని కేంద్రం వెల్లడించింది.
- 20% ఇథనాల్ ఉండటం వల్ల కొన్ని పాత మోడల్ వాహనాలలోని రబ్బర్ గొట్టాలు లేదా కొన్ని ప్లాస్టిక్ విభాగాలు దీర్ఘకాలంలో స్వల్పంగా ప్రభావితం కావచ్చు. అయితే దీనికోసం పార్ట్‌లను సులభంగా మార్చుకోవచ్చని తెలిపింది.
E20 పెట్రోల్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటి?
ఈ స్వల్ప మైలేజ్ వ్యత్యాసాన్ని పక్కన పెడితే E20 పెట్రోల్ వల్ల దేశానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, ఇతర విష వాయువుల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. అలాగే చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
రైతులకు ప్రయోజనం:
ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు, ధాన్యం నుండి తయారు చేస్తారు. దీనివల్ల మన దేశ రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
వాహనదారులు ఏం చేయాలి?
కొత్తగా వచ్చే దాదాపు అన్ని వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగానే తయారవుతున్నాయి. పాత వాహనాలు ఉన్నవారు క్రమం తప్పకుండా టైమ్ టు టైమ్ వెహికల్ సర్వీసింగ్ చేయించుకోవడం, ఫ్యూయల్ ఫిల్టర్లను తనిఖీ చేసుకోవడం ద్వారా వాహన పనితీరును మెరుగ్గా ఉంచుకోవచ్చు. E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ కాస్త తగ్గినా, ఇంజిన్‌లు పాడైపోతాయనే భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. ఇది పర్యావరణానికి మేలు చేసే దిశగా భారతదేశం వేస్తున్న ఒక అడుగు.
ఇది కూడా చదవండి: Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు!
Indian Railways: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




