హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన వేడుక కన్నుల పండువగా సాగుతోంది. జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో నుంచి గణనాధులు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చేరుకుంటున్నారు. నిమజ్జనం చూసేందుకు వచ్చిన భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై గణేశా.. జై జై గణేశా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు.