AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ బిల్లుల్లో తగ్గుతున్న ఛార్జీలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. 'ట్రూడౌన్' ప్రక్రియ ద్వారా గత రెండేళ్లలో రూ. 1553 కోట్ల విద్యుత్ ఛార్జీల రాయితీని APERC ఆమోదించింది. డిస్కంల సమర్థవంతమైన నిర్వహణతో లభించిన ఈ లబ్ధి భవిష్యత్ బిల్లుల్లో సర్దుబాటు కానుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులందరికీ ఇది గణనీయమైన ఆర్థిక ఉపశమనం.

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ బిల్లుల్లో తగ్గుతున్న ఛార్జీలు..!
Ap Electricity Bill NewsImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Sep 25, 2026 | 8:10 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ‘ట్రూడౌన్’ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఛార్జీల్లో రాయితీ పొందే అవకాశం లభించింది. రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ కారణంగా ఈ లబ్ధి చేకూరింది.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.629 కోట్లను ట్రూడౌన్ చేసేందుకు అనుమతి లభించింది. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారులకు అందజేసే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని APERC డిస్కంలను ఆదేశించింది.

అంతేకాకుండా, గత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ రూ.924 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసింది. దీనివల్ల ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై 13 పైసల చొప్పున డిస్కంలు ఛార్జీలు తగ్గిస్తున్నాయి. వరుసగా రెండేళ్లలో దాదాపు రూ.1,553 కోట్లను ట్రూడౌన్ చేయడం ద్వారా గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు గణనీయమైన ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

సాధారణంగా ప్రతిపాదనల కంటే నిర్వహణ వ్యయం పెరిగితే ‘ట్రూఅప్’ పేరిట కస్టమర్లపై అదనపు భారం పడుతుంది. అయితే వ్యయం తగ్గడం వల్ల జరిగే ఈ ‘ట్రూడౌన్’ ప్రక్రియ కారణంగా భవిష్యత్తు బిల్లుల్లో కస్టమర్లకు ఈ డిస్కౌంట్ నేరుగా సర్దుబాటు కానుంది. పారదర్శకమైన పాలన, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us