అక్టోబర్ 1 నుంచి కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్..
Venkatrao Lella
Images: Pinterest
23 SEP 2026
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారిపై ఈ నిబంధనలు ప్రభావం చూపనున్నాయి.
పెద్ద మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై ఇప్పటివరకు బ్యాంకులు వేర్వేరుగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ఇక నుంచి బ్యాంకులు తమ అన్ని శాఖలలో ఒకే మొత్తం, కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒకే విధమైన వడ్డీ రేట్లను అందించాలని ఆర్బీఐ నిబంధనలు విధించింది.
మెట్రో బ్రాంచ్‌లో లేదా గ్రామీణ ప్రాంతంలోని బ్యాంకుల్లో అయినా టర్మ్ డిపాజిట్ చేస్తే ఒకే వడ్డీ రేటు ఉండాలి. దీని ద్వారా ఒకే తేదీన సమాన మొత్తంలో నిధులను డిపాజిట్ చేసే ప్రతి కస్టమర్ ఒకే విధమైన రాబడి వస్తుంది.
రూ. 3 కోట్లకు మించి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. బ్యాంకులు వీటిని బ్రాంచ్‌లను బట్టి వడ్డీ రేట్లను మార్చుతూ ఉంటుంది.
ఇక నుంచి బ్యాంకులు బల్క్ డిపాజిట్ రేట్ కార్డులను ప్రతి ఉదయం 10:00 గంటలలోపు తమ అధికారిక వెబ్‌సైట్లలో తప్పనిసరిగా పొందుపర్చాలి. కస్టమర్లు అందరికీ వీటిని ఒకేలా వర్తింపచేయాలి.
ఆర్బీఐ బ్యాంకులకు ఉదయం 10:10 గంటల వరకు కచ్చితంగా 10 నిమిషాల గడువును ఇస్తుంది. ఈ ముందస్తు బహిరంగ ప్రకటనలు, పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే ముందు వర్తించే రేట్లను సరిచూసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
అక్టోబర్ 1 నుంచి ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ రూల్స్ అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసేవారు దీని గురించి అవగాహన కలిగి ఉండాలి.
కస్టమర్లు అందరికీ ఒకేలా వడ్డీ రేట్లు ఉండేలా చేయడం, పారదర్శకంగా డిపాజిట్లను అమలు చేసేలా చేసేందుకు ఆర్బీఐ ఈ రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.