AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశమా?

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన పసిడి ధరలు.. క్రమంగా దిగి వస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్‌ 25వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత రెండు,

Gold Price Today: పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశమా?
Gold Price
Subhash Goud
|

Updated on: Sep 25, 2026 | 6:33 AM

Share

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల పరుగులు పెట్టిన పసిడి ధరలు.. క్రమంగా దిగి వస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్‌ 25వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత రెండు, మూడు రోజులుగా చూస్తే తులం బంగారంపై భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తులం బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,820 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,940 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,670 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,940 వద్ద కొనసాగుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,990 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం కిలోగ్రాము వెండి ధర 2,44,900 వద్ద కొనసాగుతోంది. ఇది నాలుగైదు రోజుల్లో కిలోపై 5 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: LPG Gas: గుడ్‌న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు.. ఎక్కడో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us