Yashasvi Jaiswal: అసలు ఆ రోజు శ్రీలంక ఆటగాడితో జైస్వాల్ గొడవేంటి.. నిజం చెప్పిన ధ్రువ్ జురేల్
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిథా ఫెర్నాండో మధ్య రెండో టెస్టులో చోటుచేసుకున్న వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ధ్రువ్ జురేల్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరోవైపు, ఐసీసీ ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక్కో డీమెరిట్ పాయింట్ విధించింది.

Yashasvi Jaiswal: క్రికెట్ మైదానంలో కొన్నిసార్లు ఉద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదాలు పెద్ద రగడకు దారితీస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం శ్రీలంక గడ్డపై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్‌లో జరిగింది. శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అలాగే లంక పేస్ బౌలర్ అసిథా ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఆటగాళ్లు ఒకరికొకరు తలతో గుద్దుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆకాశ్ చోప్రా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అసలు కారణం కారణం అదే
మ్యాచులో అసిథా ఫెర్నాండో వేసిన అద్భుతమైన బంతికి యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వికెట్ పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన లంక బౌలర్ మైదానంలో దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అవుట్ అయిన తర్వాత జైస్వాల్ ఎంతో ప్రశాంతంగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అసిథా ఫెర్నాండో ఇష్టానుసారం బూతులు తిడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని ధ్రువ్ జురెల్ తెలిపాడు. సాధారణ దూకుడును ఎవరైనా స్వాగతిస్తారని, కానీ వ్యక్తిగతంగా దూషించడం లేదా హద్దులు మీరి ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని జైస్వాల్ తమతో చెప్పినట్లు జురెల్ స్పష్టం చేశాడు.
🥵 THINGS GET HEATED! 🥵
Yashasvi Jaiswal and Asitha Fernando exchange words as tensions rise in the middle. 👀
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/7qJrORjx8V
— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026
అనవసరంగా గొడవలకు దిగడు
యశస్వి జైస్వాల్ స్వతహాగా చాలా శాంత స్వభావం కలవాడని, ఎవరితోనూ అనవసరంగా గొడవలకు దిగే రకం కాదని జురెల్ గుర్తుచేశాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు తమ జట్టు సభ్యులను కవ్విస్తే మాత్రం ఊరుకునేది లేదని, మైదానంలో తగిన బదులు ఇస్తామని జైస్వాల్ స్పష్టం చేసినట్లు వెల్లడించాడు. ఆ ఘటనలో కూడా లంక బౌలర్ కావాలనే రెచ్చగొట్టడం వలనే మైదానంలో ఉద్రిక్తత పెరిగిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిందని వివరించాడు. ఈ అనూహ్య పరిణామంతో మైదానంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఐసీసీ నుంచి జరిమానా, భవిష్యత్తు అప్రమత్తత
ఈ అనూహ్య ఘటనపై వెంటనే స్పందించిన ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను యశస్వి జైస్వాల్ అలాగే అసిథా ఫెర్నాండో ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అయితే గడిచిన 24 నెలల్లో జైస్వాల్‌కు ఇది మొదటి పెద్ద నేరం కావడంతో, మ్యాచ్ నిషేధం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కేవలం ఒక డెమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు. ఈ వివాదం ద్వారా ఆటగాళ్లు మైదానంలో ఎంత సంయమనం పాటించాలనే దానిపై పెద్ద చర్చ నడిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
