AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Umpire Salary: ఒక్కో మ్యాచ్‌కు అంపైర్ల శాలరీ ఇదే.. ఫైనల్ పోరుకు ఏకంగా ఎంతంటే..?

IPL Umpire Salary: ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైర్లకు ఎంత ముడుతుందో మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి బయటపెట్టాడు. సీజన్‌కు రూ.45-50 లక్షలు, ఫైనల్‌కు 8000 డాలర్లంటూ షాకిచ్చాడు. ధోని, కోహ్లీ, రోహిత్ DRS తీరుపైనా మాట్లాడాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

IPL Umpire Salary: ఒక్కో మ్యాచ్‌కు అంపైర్ల శాలరీ ఇదే.. ఫైనల్ పోరుకు ఏకంగా ఎంతంటే..?
Ipl Umpire Salary
Venkata Chari
|

Updated on: Nov 28, 2026 | 12:49 PM

Share

IPL Umpire Salary Anil Chaudhary: క్రికెట్లో ప్లేయర్లకు కోట్లు ముడతాయని అందరికీ తెలుసు. కానీ మ్యాచ్‌ను నడిపించే అంపైర్లకు ఎంత వస్తుందో తెలుసా..? మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్లో అంపైర్ల ఫీజులపై మాట్లాడాడు. పైగా ధోని, కోహ్లీ, రోహిత్ DRS తీసుకునే తీరుపై ఆసక్తికర విషయాలు చెప్పాడు.

28 ఏళ్ల కెరీర్ తర్వాత 2025 ఆరంభంలో రిటైర్ అయిన అనిల్ చౌదరి.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత అనుభవజ్ఞుడైన అంపైర్. ఆన్-ఫీల్డ్‌గా 131 మ్యాచ్‌లు, టీవీ అంపైర్‌గా కలిపి మొత్తం 226 ఐపీఎల్ మ్యాచ్‌లలో పనిచేశాడు. ICC ప్యానెల్‌లో దశాబ్దానికి పైగా ఉన్నాడు.

మ్యాచ్‌కు 4000 డాలర్లు.. సీజన్‌కు రూ.50 లక్షలు..!

ఐపీఎల్‌లో అంపైర్లకు భారీగానే ముడుతుందని చౌదరి చెప్పాడు. “ఒక మ్యాచ్‌కు 4000 డాలర్లు. ప్లేఆఫ్స్ చేస్తే 6000 డాలర్లు. ఫైనల్ చేస్తే 8000 డాలర్లు. పైగా DA కింద 6000 డాలర్లు వస్తుంది” అని వెల్లడించాడు. సగటున ఐపీఎల్‌లో పనిచేసే అంపైర్ ఒక్క సీజన్‌లో రూ.45-50 లక్షలు సంపాదిస్తాడని తెలిపాడు. పైగా డొమెస్టిక్ క్రికెట్‌లో టాప్ అంపైర్ అయితే మరో రూ.20-25 లక్షలు వస్తుందన్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

టెస్టుకు రూ.8 లక్షలు.. వర్షం పడినా డబ్బు పక్కా..!

ఇంటర్నేషనల్ క్రికెట్ ఫీజులపైనా క్లారిటీ ఇచ్చాడు. “టీ20కి రూ.2 లక్షలు, టెస్టుకు రూ.8 లక్షలు వస్తుంది. మ్యాచ్ వర్షంతో రద్దయినా డబ్బు ఆగదు. మ్యాచ్ జరిగినా, జరగకపోయినా అంపైర్ పేమెంట్‌కు సంబంధం లేదు” అని చెప్పాడు.

ధోని మాస్టర్.. కోహ్లీ ఆవేశం.. రోహిత్ ఆచితూచి..!

అదే పాడ్‌కాస్ట్‌లో DRSపై భారత కెప్టెన్ల తీరును వివరించాడు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టింక్ట్‌ను నమ్మి వెంటనే రివ్యూకు వెళ్లేవాడని, రోహిత్ శర్మ కాలం గడిచేకొద్దీ ఆచితూచి, లెక్కలతో రివ్యూ తీసుకునేవాడని చెప్పాడు. ధోనిని మాత్రం DRS మాస్టర్ అని ప్రశంసించాడు. వికెట్ వెనుక నుంచి లైన్‌ను పసిగట్టడం, ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడంలో ధోని అసాధారణమన్నాడు. అయితే ధోని కూడా ఒక అరుదైన సందర్భంలో రివ్యూ తప్పు చేశాడని గుర్తుచేశాడు.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

మొత్తంగా చూస్తే.. ప్లేయర్లతో పాటు అంపైర్లకు కూడా ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తోందని ఈ లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us