AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 Captains List: ఖరారైన 7 జట్ల కెప్టెన్లు.. ఆ మూడు జట్లపై ఉత్కంఠ..?

IPL 2027 Captains: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలం జరగనుండగా.. 10 జట్లు తమ రిటెన్షన్ లిస్ట్ ప్రకటించాయి. రోహిత్ శర్మ మళ్లీ ముంబై కెప్టెన్ కాగా.. రజత్, రుతురాజ్, గిల్ సహా 7గురు ఖరారయ్యారు. 3 జట్ల పరిస్థితి ఏంటంటే..

IPL 2027 Captains List: ఖరారైన 7 జట్ల కెప్టెన్లు.. ఆ మూడు జట్లపై ఉత్కంఠ..?
Ipl 2027 Captains List
Venkata Chari
|

Updated on: Nov 28, 2026 | 11:43 AM

Share

IPL 2027 Captains List Confirmed: ఐపీఎల్ 2027 మినీ వేలం 2026 డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. వేలానికి ముందు 10 జట్లు తమ రిటెన్షన్ కెప్టెన్ లిస్ట్ వెల్లడించాయి. 7 జట్ల కెప్టెన్లు దాదాపు ఖరారయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ సహా 3 జట్ల కెప్టెన్ల పరిస్థితి తేలలేదు. గత 2026 సీజన్‌లో ఢిల్లీని నడిపించిన అక్షర్ పటేల్ రిటెన్ అయినా.. రిషబ్ పంత్ రాకతో ఎవరు కెప్టెన్ అన్న ప్రశ్న మొదలైంది. అదే సమయంలో నిన్న అంటే నవంబర్ 27న ముంబై ఇండియన్స్ మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2027లో ఖరారైన కెప్టెన్ల వివరాలు తెలుసుకుందాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పటీదార్..

రజత్ పటీదార్ సారథ్యంలో ఆర్‌సిబి 18 ఏళ్లలో తొలి టైటిల్ గెలిచింది. 2025లోనే కాదు.. 2026లోనూ ఆర్‌సిబికి ఛాంపియన్ టైటిల్ అందించాడు. అందుకే ఐపీఎల్ 2027లోనూ రజత్ పటీదారే బెంగళూరు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్..

ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ కాగా.. ధోని హయాంలోనే నియమితులైన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. సంజూ శాంసన్ రాకతో గైక్వాడ్‌ను తప్పిస్తారన్న చర్చ మొదలైనా.. గత 2026లో సంజూ గైక్వాడ్ కెప్టెన్సీలోనే ఆడాడు. అందుకే రాబోయే ఐపీఎల్ 2027లోనూ రుతురాజే కొనసాగుతాడని భావిస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027 Auction: అన్‌క్యాప్డ్ ఇండియన్స్‌పై కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈ ముగ్గురు కోటీశ్వరులవ్వడం పక్కా..!

గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్..

హార్దిక్ పాండ్యా 2023 తర్వాత వీడటంతో గుజరాత్ శుభ్మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఆ తర్వాత గిల్ టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ కూడా అయ్యాడు. అతడిని తప్పించడానికి కారణమే లేదు. ఐపీఎల్ 2027లోనూ గిల్ గుజరాత్ కెప్టెన్‌గా కొనసాగుతాడు.

పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్..

హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా పంజాబ్‌లోకి వచ్చాడు. దీంతో హార్దికే కెప్టెన్ అవుతాడా అన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే శ్రేయస్ అయ్యరే కెప్టెన్‌గా కొనసాగుతాడని పాండ్యానే స్పష్టం చేశాడు.

రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్..

గత 2026లో సంజూ శాంసన్ వీడాక రాజస్థాన్ రియాన్ పరాగ్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించింది. యువ ఆటగాడు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ చేశారు. పరాగ్ కొనసాగడం దాదాపు ఖాయమైంది.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్..

సగం సీజన్ ఆడినా.. అందుకోసం భారత్‌కు వస్తానని పాట్ కమిన్స్ హామీ ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో అతడే కెప్టెన్‌గా కొనసాగుతాడు. కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ బాధ్యతలు తీసుకోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్: సస్పెన్స్..

గత 2026లో అక్షర్ పటేల్ ఢిల్లీకి నాయకత్వం వహించాడు. కానీ ఇప్పుడు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ట్రేడ్ ద్వారా తిరిగి వచ్చాడు. కోచింగ్ స్టాఫ్‌లోనూ మార్పులు జరిగాయి. సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్‌గా వచ్చారు. ఢిల్లీ కెప్టెన్ పరిస్థితి తేలలేదు.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

కోల్‌కతా నైట్ రైడర్స్: కొత్త బాస్ ఎవరు..?

2026లో అజింక్యా రహానే కేకేఆర్‌కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత రహానే రిటైర్ అయ్యాడు. కేకేఆర్ ఇంకా కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు. రింకూ సింగ్ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్: పూరనేనా..?

రిషబ్ పంత్ వీడాక లక్నో కూడా కొత్త కెప్టెన్ పేరును ఇంకా ప్రకటించలేదు. అయితే నికోలస్ పూరన్ కెప్టెన్ కావచ్చని తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్ కాగా.. ఢిల్లీ, కేకేఆర్, లక్నో నిర్ణయంపైనే అందరి కన్ను ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us