AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak : అతడిలా ఒక్కరోజు బతికితే చాలు.. సినిమా పోయిందంటే ఒక్క మాట చెప్పాడు.. డైరెక్టర్..

తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో వి. వి. వినాయక్ స్థానం ప్రత్యేకం. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే సినిమాలపై ఉన్న అమితమైన ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కష్టపడి, ఆ తర్వాత టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరికీ భారీ బ్లాక్‌బస్టర్ విజయాలు అందించిన స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు.

VV Vinayak : అతడిలా ఒక్కరోజు బతికితే చాలు.. సినిమా పోయిందంటే ఒక్క మాట చెప్పాడు.. డైరెక్టర్..
Vv Vinayak
Rajitha Chanti
|

Updated on: Nov 28, 2026 | 11:31 AM

Share

టాలీవుడ్‌లో దాదాపు ఒకే సమయంలో ప్రయాణం ప్రారంభించి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వి. వి. వినాయక్, పూరి జగన్నాథ్ , ఎస్. ఎస్. రాజమౌళిల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ మనస్తత్వం, కమర్షియల్ సినిమాల సవాళ్లు, విజయాలు-పరాజయాలను ఎదుర్కొనే విధానంపై వివి వినాయక్ పంచుకున్న ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట సందడి చేస్తున్నాయి. పూరి జగన్నాథ్ ఏ విషయాన్నీ అనవసరంగా తలకెక్కించుకోకుండా, చాలా ధైర్యంగా, లైట్‌గా తీసుకుంటారని వివి వినాయక్ తెలిపారు. దీనికి ఉదాహరణగా శివమణి సినిమా విడుదల సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. సినిమా తొలిరోజు నెగటివ్ టాక్ వస్తోందని, సినిమా పోయిందని ఎవరో ఫోన్‌లో చెప్పినప్పుడు, పూరి మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా చాలా క్యాజువల్‌గా ఉండిపోయారట. అటర్ ఫ్లాప్ అంటున్నారు.. పోయిందంట సినిమా అని అవతలి వ్యక్తి చెబితే, సరే.. రేపు కలుద్దాంలే అని ఒక్క మాటలో తేలికగా తీసుకుని మళ్లీ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారని వినాయక్ చెప్పారు. అలా ఫలితాన్ని అంత సులువుగా తీసుకునే ధైర్యం తనకు ఎంతో ఇష్టమని, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూరి ఒకేలా ఉంటారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

కమర్షియల్ సినిమాలపై మేధావి వర్గం లేదా కొందరు ప్రేక్షకులు చూపే దృక్పథంపై కూడా వినాయక్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కమర్షియల్ సినిమా ఆడుతున్నప్పుడు తక్కువ చూపుతో చూస్తారని, డబ్బులు సాధించి విజయం సాధించిన తర్వాతే గొప్పగా చూస్తారని అన్నారు. కథతో సంబంధం లేని అంశాలైనా పాటలు, ఫైట్లు, కామెడీ వంటివి ప్లేస్‌మెంట్ చేసి, అన్నింటినీ ఒక కథగా మలిచి హిట్ కొట్టడం చాలా కష్టమైన పని అని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు తనకు చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

బాహుబలి విడుదలైన తొలి మూడు-నాలుగు రోజులు బయట వచ్చిన టాక్ కారణంగా రాజమౌళి, ప్రభాస్, నిర్మాతలు కాస్త డల్‌గా ఉన్నారని వినాయక్ పేర్కొన్నారు. ఆ సినిమా అసలు రేంజ్ ఏమిటో వారికి అర్థం కావడానికి వారం నుంచి పది రోజులు పట్టిందని, అప్పుడు పూరి జగన్నాథ్ ఎంత ధైర్యంగా ఉంటారనే విషయాన్ని గుర్తుచేసుకున్నట్లు వివరించారు. హిట్స్, ఫ్లాప్‌లు సహజమని, సమయం, అనుభవాలు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని వినాయక్ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

పూరి జగన్నాథ్..

Vinayak, Puri Jagannadh

Vinayak, Puri Jagannadh

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us