AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిస్లేరీ నీటిలో బ్యాక్టీరియా కలకలం.. కంపెనీపై కేసుకు FSSAI అనుమతి!

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ దిగ్గజ సంస్థ బిస్లేరీ ఇంటర్నేషనల్‌కు మరో చట్టపరమైన చిక్కు ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని తయారీ యూనిట్ నుంచి సేకరించిన తాగునీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆ సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అనుమతి మంజూరు చేసింది. ఆహార భద్రతా ప్రమాణాల నిబంధనల ఉల్లంఘన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

బిస్లేరీ నీటిలో బ్యాక్టీరియా కలకలం.. కంపెనీపై కేసుకు FSSAI అనుమతి!
Bisleri Controversy
Jyothi Gadda
|

Updated on: Nov 28, 2026 | 10:54 AM

Share

పశ్చిమ బెంగాల్‌లోని బిస్లేరీ ప్లాంట్ నుంచి సేకరించిన మంచినీటి నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) అనుమతి ఇచ్చింది. జల్పాయ్‌గురి జిల్లాలోని తెలిపారా గ్రామ యూనిట్ నుంచి సేకరించిన ఈ నమూనాను ప్రాథమిక, రెఫరల్ ల్యాబొరేటరీలు పరీక్షించి, బ్యాక్టీరియా ఉనికిని ధ్రువీకరించాయి. ఈ ఘటనకు సంబంధించి PB 201 బ్యాచ్ విక్రయాలపై గత ఆగస్టులోనే నిషేధం విధించారు. ఇటీవల గోవా యూనిట్ నమూనా విషయంలోనూ ఇలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో, బిస్లేరీపై ఇది వరుసగా రెండో ప్రాసిక్యూషన్ చర్యగా నిలిచింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలను ముమ్మరం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా, తెలిపారా గ్రామంలో ఉన్న బిస్లేరీ తయారీ ప్లాంట్ నుంచి ఈ నమూనాను సేకరించారు. ప్రాథమిక ల్యాబొరేటరీతో పాటు రెఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీ కూడా నమూనాలో కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ధ్రువీకరించాయి. మురుగునీటి లీకేజీలు, దెబ్బతిన్న పైపులు లేదా పరిశుభ్రత లోపాల వంటి కారణాల వల్ల నీటి వ్యవస్థలోకి ఇలాంటి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా, సంబంధిత నిర్దిష్ట బ్యాచ్ విక్రయాలను ఆగస్టు 12, 2026న నిషేధించారు.

వరుసగా రెండో చర్య

ప్యాకేజ్డ్ వాటర్ నమూనా పరీక్షల్లో విఫలమైన నేపథ్యంలో బిస్లేరీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం ఇది వరుసగా రెండోసారి. ఇటీవల గోవాలోని బిస్లేరీ యూనిట్ నుంచి సేకరించిన మంచినీటి నమూనా కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, ఆ కేసులోనూ నియంత్రణ సంస్థ ఇదే తరహా న్యాయపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఇవి కూడా చదవండి

అయితే, తాజా పశ్చిమ బెంగాల్ వ్యవహారం నిర్దిష్ట బ్యాచ్‌కు మాత్రమే పరిమితమైందని, దీనివల్ల బిస్లేరీ ఉత్పత్తులన్నింటినీ అసురక్షితమైనవిగా ప్రకటించినట్లు కాదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు, దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నాణ్యత, భద్రతా నిబంధనల అమలుపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ తాజా పరిణామంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బిస్లేరీ ఇంటర్నేషనల్ నుంచి తక్షణ స్పందన వెలువడలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us