AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 Auction: అన్‌క్యాప్డ్ ఇండియన్స్‌పై కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈ ముగ్గురు కోటీశ్వరులవ్వడం పక్కా..!

IPL 2027 Auction Uncapped Players: డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలంలో 1220 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. అందులో ఈ 3 అన్‌క్యాప్డ్ భారత ప్లేయర్లు కోట్లలో అమ్ముడుపోయి కోటీశ్వరులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2027 Auction: అన్‌క్యాప్డ్ ఇండియన్స్‌పై కన్నేసిన ఫ్రాంచైజీలు.. ఈ ముగ్గురు కోటీశ్వరులవ్వడం పక్కా..!
Ipl 2027 Auction Uncapped Indian Players
Venkata Chari
|

Updated on: Nov 28, 2026 | 10:44 AM

Share

IPL 2027 Auction Uncapped Indian Players: ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలం కోసం మొత్తం 1220 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 939 మంది భారత ప్లేయర్లు కాగా.. 17 దేశాల నుంచి 281 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు 184 మందిని రిటెన్ చేసుకోగా.. ఇంకా 66 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో 25 విదేశీ స్లాట్లు ఉన్నాయి. ప్రతిసారి వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఈసారి 994 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు బరిలో ఉన్నారు. అందులో 925 మంది భారతీయులు. వారిలో 127 మంది ఇప్పటికే ఐపీఎల్ ఆడగా.. 798 మంది తొలిసారి బరిలోకి దిగుతున్నారు. 69 మంది విదేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఈ క్రమంలో కోట్లలో అమ్ముడుపోయే 3 భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లెవరో తెలుసుకుందాం..

1. నేహాల్ వధేరా.. లాభం ఎవరికో..!

ఈ లిస్టులో తొలి పేరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నేహాల్ వధేరాది. పంజాబ్ కింగ్స్ అతడిని రిలీజ్ చేసింది. లీగ్‌లో సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా పేరున్న వధేరా.. గత సీజన్‌లో నిరాశపరచడంతో PBKS రిటెన్ చేయలేదు. అయితే ఇదే వధేరాకు లాభం చేకూర్చేలా ఉంది. ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో పాటు వేగంగా పరుగులు చేసే భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం జట్లు వెతుకుతున్నాయి. అందుకే వేలంలో వధేరాకు కోట్లు దక్కడం ఖాయమంటున్నారు.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

ఇవి కూడా చదవండి

2. ఆర్యవీర్ సెహ్వాగ్.. సెహ్వాగ్ వారసుడిపై కోట్ల వర్షం..!

వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఐపీఎల్ 2027 వేలంలో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 361 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్యవీర్ కుడిచేతి వాటం విధ్వంసకర ఓపెనర్. అతడి బ్యాటింగ్ స్టైల్ టీ20కి బాగా సూటవుతుంది. ఇలాంటి యువ బ్యాటర్ కోసం చాలా జట్ల మధ్య హోరాహోరీ నెలకొనొచ్చు. అందుకే సెహ్వాగ్ పెద్ద కుమారుడికి కోట్లు దక్కడం ఖాయం.

3. అభిషేక్ పోరెల్.. కేకేఆర్ కన్ను పడిందిగా..!

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. గత సీజన్‌లో పోరెల్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. జట్టు ప్రణాళికల్లో సరిపోలేదు. అందుకే ఐపీఎల్ 2027 వేలంలో బెంగాల్ ప్లేయర్ కనిపించనున్నాడు. వికెట్ కీపర్‌తో పాటు టాప్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే పోరెల్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ సహా కొన్ని జట్ల కన్ను పడినట్లు తెలుస్తోంది. అందుకే అతడికి మళ్లీ భారీ ధర దక్కొచ్చు.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

మొత్తంగా చూస్తే.. 994 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు బరిలో ఉన్నా.. ఈ ముగ్గురిపైనే అందరి దృష్టి ఉంది. మరి డిసెంబర్ 16న వీరిని ఏ జట్టు దక్కించుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us