పంజాబ్ కింగ్స్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కాగా, ప్రీతి జింటా, నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్ యజమానులుగా ఉన్నారు. బాలీవుడ్ నటి పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లలో ఎల్లప్పుడూ జట్టుకు మద్దతుగా కనిపిస్తుంది. కోచ్ బేలిస్. 2008లో కింగ్స్ XI పంజాబ్ (KXIP)గా స్థాపించబడిన ఫ్రాంచైజీని మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్ సంయుక్తంగా కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 2021లో జట్టు పేరు కింగ్స్ XI పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్‌గా మార్చారు. 2014 సీజన్‌లో, జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి రన్నరప్‌గా నిలిచింది. ఇది కాకుండా 13 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్‌లకు చేరుకున్నారు. జట్టు సహ యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.
ఐపీఎల్ 2021 సీజన్ వరకు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, 2023లో శామ్ కర్రాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.