AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆశ్చర్యం !! ఆలయంలో తాబేలు ప్రదక్షిణలు..

ఆశ్చర్యం !! ఆలయంలో తాబేలు ప్రదక్షిణలు..

Phani CH
|

Updated on: Mar 12, 2026 | 9:15 AM

Share

పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం నూకాలమ్మ ఆలయంలో ఒక అరుదైన దృశ్యం వెలుగుచూసింది. సాధారణంగా భయపడే తాబేలు, ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, స్వచ్ఛందంగా ప్రదక్షిణలు చేసింది. మూగజీవులలోనూ భక్తి ఉంటుందని నిరూపించిన ఈ సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. ఈ దైవభక్తికి నిదర్శనమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నూకాలమ్మ మహిమగా కొనియాడబడుతోంది.

భక్తి కేవలం మనుషులకే పరిమితం కాదని, మూగజీవాల్లోనూ దైవచింతన ఉంటుందని నిరూపించే ఒక అరుదైన దృశ్యం పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. అంతర్గాం మండల కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంలో ఒక తాబేలు చేసిన పని ఇప్పుడు స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. సాధారణంగా తాబేళ్లు మనుషుల అలికిడి వింటేనే భయపడి దూరంగా వెళ్తుంటాయి. కానీ, అంతర్గాం నూకాలమ్మ ఆలయానికి ఎక్కడి నుంచి వచ్చిందోకానీ ఒక తాబేలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈ తాబేలు, నేరుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. మొదట దీన్ని గమనించిన స్థానికులు ఏదో దారి తప్పి వచ్చి ఉంటుందని భావించారు. కానీ, ఒకసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన ఆ కూర్మం, ఆగకుండా మళ్లీ రెండోసారి కూడా ప్రదక్షిణను కొనసాగించడంతో అక్కడివారు ఆశ్చర్యపోయారు. వెళ్లేందుకు పక్కనే ఖాళీ దారులు ఉన్నప్పటికీ, పద్ధతిగా ఆలయం చుట్టూ తిరగడం భగవంతుని పట్ల ఆ జీవికి ఉన్న భక్తికి నిదర్శనమని గ్రామస్తులు చర్చించుకున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడి వారు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. విషయం గ్రామం మొత్తం తెలియడంతో జనం భారీగా ఆలయానికి తరలివచ్చారు. జనం తాకిడి పెరగడంతో ఆ తాబేలు నెమ్మదిగా సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. నూకాలమ్మ తల్లి మహిమ వల్లే ఈ వింత జరిగిందని, ఇది శుభపరిణామమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Follow Us