Thanuja: ఫ్యాన్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
బిగ్ బాస్ 9 రన్నరప్ తనూజ పుట్టస్వామి, 'ముద్ద మందారం' సీరియల్‌తో గుర్తింపు పొందింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమాని రాసిన డైరీని చదువుతూ భావోద్వేగానికి లోనయ్యి, కన్నీళ్లు పెట్టుకున్న పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం 'అగ్నీ పరీక్ష' సీరియల్‌తో పాటు వెండితెర అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
తనూజ పుట్టస్వామి! ముద్దా మందారం సీరియల్‌తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రీసెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 9 షోలోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసుతనంతో.. అందరికీ ఫెవరెట్ అయిపోయింది. షో మొదటి నుంచి విన్నర్ ట్యాగ్ సొంతం చేసుకున్నతనూజ.. చివరకు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న తనూజ.. నిత్యం ఏదోక పోస్ట్ పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సంతోషం పట్టలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం తన ఇన్ స్టా స్టోరీతో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని.. దాన్ని చదువుతున్నానని చెప్పుకొచ్చింది. “నేను ఎంతో అదృష్టవంతురాలినో కదా. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. కానీ ఈసారి నేను చాలా ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నా కోసం ప్రత్యేకంగా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నమ్ముతారో లేదో.. ఇది చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకునేది మన ఫ్యామిలీ మాత్రమే. కానీ నా విషయంలో ఎంతో మంది అర్థం చేసుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నా కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది తనూజ. అలాగే తన కోసం ప్రత్యేకంగా డైరీ రాసిన అమ్మాయికి ఐ లవ్యూ చెప్పుకొచ్చింది తనూజ.ఇక ముద్ద మందారం సీరియల్ తర్వాత మరో సీరియల్ చేయని తనూజ.. ఇప్పుడు అగ్నీ పరీక్ష సీరియల్లో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

