Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం
మెగాస్టార్ మమ్ముట్టి వయనాడ్ పర్యటనలో పార్టీ రంగు పులుముకోకూడదని చేసిన అభ్యర్థన వివాదంగా మారింది. హిడెన్ కెమెరా రికార్డింగ్ వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర సైబర్ దాడులు జరిగాయి. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ, మమ్ముట్టికి క్షమాపణలు చెప్పి, దాడులను తీవ్రంగా ఖండించారు. కేరళ గౌరవాన్ని పెంచే మమ్ముట్టిపై ఇలాంటివి జరగడం దురదృష్టకరం అన్నారు.
వయనాడ్ ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని వెళ్లిన మెగాస్టార్ మమ్ముట్టికి అక్కడ ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ రంగు పులుముకోకూడదని ఆయన చేసిన ఒక సున్నితమైన విన్నపాన్ని వివాదంగా మలిచి.. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై స్వయంగా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. మెగాస్టార్‌కు సారీ చెప్పారు. వయనాడ్ పర్యటన సమయంలో మమ్ముట్టి.. సీపీఎం జిల్లా కార్యదర్శి రఫీక్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ.. ‘నువ్వు నా పక్కనే ఉంటే నేను నీ కోసమే ఇక్కడికి వచ్చానని జనం అనుకుంటారు. దయచేసి కాస్త దూరంగా ఉండు’ అని చాలా సున్నితంగా కోరారు. అయితే అక్కడ ఉన్న హిడెన్ కెమెరాలు ఈ సంభాషణను రికార్డ్ చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీపీఎం అనుకూల సైబర్ కార్యకర్తలు మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు, దుర్భాషలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో కలత చెందిన మమ్ముట్టి నేరుగా కె. రఫీక్‌కు ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రఫీక్ ఫేస్‌బుక్ ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని అభ్యర్థించారు. ఇక పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు. మమ్ముట్టి పర్యటన కేవలం వయనాడ్ మంచి కోరి చేసినదే అని.. ఆయన పడ్డ బాధకు తాను చింతిస్తున్నా అన్నారు సీఎం పినరయి. అంతేకాదు కేరళ గౌరవాన్ని పెంచే మమ్ముట్టి లాంటి గొప్ప నటుడిపై సోషల్ మీడియా దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనను బాధపెట్టి ఉంటే దానికి ముఖ్యమంత్రిగా తాను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రజలందరూ గౌరవించే వ్యక్తిపై జరిగిన ఈ సైబర్ దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మమ్ముట్టి కేరళ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అని ఆయనను అవమానించడం తగదని సీఎం స్పష్టం చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar 02: ధురంధర్ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్
The Taj Story OTT: తాజ్ మహల్ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..
Thanuja: ఫ్యాన్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

