AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

Samatha J
|

Updated on: Aug 04, 2026 | 1:19 PM

Share

ఆగస్టు 2026 టాలీవుడ్‌కు అత్యంత ప్రత్యేకమైన నెల కానుంది. టాక్సిక్, ది పారడైజ్ వంటి సినిమాల టీజర్లు, అలాగే మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జునల పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ వెయిటెడ్ సినిమాల అప్డేట్స్, టీజర్లు విడుదల కానున్నాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి కూడా కీలక ప్రకటన రానుంది.

టాలీవుడ్ ప్రేక్షకులకు ఆగస్టు 2026 నెల ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండబోతోంది. సాధారణంగా కొత్త సినిమాల హడావుడితో సందడి చేసే ఈ నెల, ఈసారి భారీ అప్డేట్స్‌తో, క్రేజీ టీజర్లతో అత్యంత ప్రత్యేకంగా మారనుంది. పాన్ ఇండియన్ సినిమాల నుంచి మోస్ట్ వెయిటెడ్ ప్రకటనలు అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేయనున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కింగ్ 100, కార్తి 30 సినిమాలకు కన్ఫామ్ అవ్వడం వంటి అప్డేట్స్‌తో ఆగస్టు నెల మొదలైంది. అల్లు అర్జున్ రాకా సినిమా మేజర్ అప్డేట్ ఆగస్టులోనే రానుంది. ఈ సినిమా టీజర్‌తో పాటు రెండు పార్ట్‌లుగా రాబోయే విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ది పారడైజ్ టీజర్ ఆగస్టు 6న విడుదల కానుంది.ఆగస్టు 8న టాక్సిక్ ట్రైలర్ రానుండగా, ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ వెయిటెడ్ వారణాసి సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లుక్ లేదా మహేష్ జర్నీకి సంబంధించిన వీడియో విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం

ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది

డబ్బు వాళ్లదే.. కానీ హీరోలు మాత్రం వాళ్లు కాదండోయ్..

పెద్ద రిస్కే తీసుకోబోతున్న అనిల్ రావిపూడి..!

Follow Us