పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. లాడపుట్టు గ్రామ సమీపంలోని పొలాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పాదముద్రలను సేకరించి చిరుత సంచారాన్ని నిర్ధారించారు. లాడపుట్టు, బొక్కెళ్ళు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. చిరుత కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించి, దాని ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పాడేరు మండలం లాడపుట్టు గ్రామానికి సమీపంలోని పొలాల్లో చిరుత ప్రత్యక్షమవ్వడంతో ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పొలాల్లో చిరుతపులి సంచరిస్తుండటాన్ని గమనించిన ఓ స్థానిక వ్యక్తి, వెంటనే తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత తిరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అక్కడ లభించిన పాదముద్రలను సేకరించారు. సేకరించిన పాదముద్రల ఆధారంగా సంచరిస్తున్న జంతువు చిరుతపులినేనని నిర్ధారించారు. చిరుత సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. లాడపుట్టు, బొక్కెళ్ళు గ్రామాల్లో స్థానికులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి గానీ, అడవిలోకి గానీ వెళ్లకూడదని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. పాడేరు ఏజెన్సీలోని ఈ ప్రాంత కొండలలో చిరుతపులి సంచరించడం ఇదే తొలిసారి కావడంతో అటవీశాఖ అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిరుత కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు, దానిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిరుత ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఫారెస్ట్ రేంజర్ ప్రేమ వెల్లడించారు. గ్రామస్తులు ఆందోళన చెందకుండా అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!
హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

