AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

Phani CH
|

Updated on: Oct 03, 2026 | 6:23 PM

Share

రైలు ప్రయాణికులకు సెంట్రల్‌ రైల్వే కీలక హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్‌ 1 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక టికెట్‌ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రాయితీ టికెట్లు, ప్రత్యేక కోటాలు, రైల్వే పాస్‌లు, గ్రూప్‌ బుకింగ్‌లు, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను తనిఖీ చేయనున్నారు. ప్రయాణికులు ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ వంటి పత్రాలను చూపించాల్సి ఉంటుంది.

రైలు ప్రయాణికులకు సెంట్రల్ రైల్వే ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో అక్రమ, అనధికార ప్రయాణాలను అరికట్టేందుకు అక్టోబర్ 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు భారీ స్థాయిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ చేపట్టనుంది. ఈ తనిఖీలు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు లోకల్ రైళ్లలోనూ విస్తృతంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల సమయంలో రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాస్‌‌లు , గ్రూప్ బుకింగ్‌లు మరియు అన్‌రిజర్వ్‌‌డ్ టికెట్లపై టికెట్ తనిఖీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తారు. టికెట్ల ప్రామాణికతను వేగంగా, కచ్చితంగా పరిశీలించేందుకు ‘టీటీఈ యాప్’ను వినియోగించనున్నారు. రాయితీలు లేదా ప్రత్యేక కోటాల కింద ప్రయాణించే వారు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలని రైల్వే స్పష్టం చేసింది. ఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు గానీ, మొబైల్ ఫోన్‌లోని ఫోటోలు గానీ చెల్లవని తేల్చిచెప్పింది. ప్రయాణికులు తమ గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీలలో ఏదైనా ఒక ఒరిజినల్ కార్డును వెంట ఉంచుకోవాలి. గ్రూప్ బుకింగ్ చేసుకున్న సందర్భంలో, టికెట్‌లో పేరున్న వారిలో కనీసం ఒక్కరైనా ఒరిజినల్ ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. అలా చూపించని పక్షంలో గ్రూప్‌లోని అందరినీ టికెట్ లేని ప్రయాణికులుగానే పరిగణిస్తారు. తనిఖీల సమయంలో సరైన ఒరిజినల్ పత్రాలు చూపించకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే కనీస జరిమానాను రూ. 250 నుంచి రూ. 500కి పెంచినట్లు సెంట్రల్ రైల్వే గుర్తు చేసింది. ప్రయాణికులు ఈ మార్గదర్శకాలను పాటించి, తనిఖీ సిబ్బందికి సహకరించి జరిమానాల బారిన పడకుండా ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..

ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!

ఏనుగునైనా చంపే కింగ్‌ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!

హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి

Ba Ba Black Sheep: పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు చేస్తుంది

Follow Us