AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

Phani CH
|

Updated on: Oct 03, 2026 | 6:27 PM

Share

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన ఫిట్‌నెస్‌ ఫిలాసఫీని వివరించాడు. శారీరకంగా దృఢంగా ఉంటేనే మనసు స్వేచ్ఛగా ఆలోచించగలదని చెప్పాడు. ఫిట్‌నెస్‌ వల్ల ఆటను ముందుగానే ఊహించుకుని, మైదానంలో ప్రణాళికలను మెరుగ్గా అమలు చేయగలుగుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం అతిగా దూకుడుగా కాకుండా, నెమ్మదించకుండా సానుకూల దృక్పథంతో ఆటలో కొత్త వెర్షన్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించాడు. వ్యాయామం మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, ఒత్తిడి నియంత్రణకు కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక క్రికెట్‌లో ఫిట్‌నెస్ ప్రమాణాలను కొత్త శిఖరాలకు చేర్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తన అద్భుతమైన ఫామ్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని పంచుకున్నాడు. శారీరక దృఢత్వానికి, మైదానంలో కనబరిచే మానసిక స్పష్టతకు మధ్య బలమైన సంబంధం ఉందని నొక్కిచెప్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అజేయంగా 139 పరుగులు చేసిన అనంతరం కోహ్లీ తన ఫిట్‌నెస్ ఫిలాసఫీని వివరించాడు. స్వేచ్ఛగా ఆలోచించే మనసు కోసం దృఢమైన శరీరం అవసరమని, తాను శారీరకంగా ఫిట్‌‌గా ఉండటానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశాడు. ఆ ఫిట్‌నెస్ వల్లే ఆటను ఎలా ఆడాలో స్పష్టంగా ఊహించుకోగలుగుతున్నానని, ఇది మైదానంలో ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయడానికి ఉత్తమ అవకాశం కల్పిస్తోందని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం తన కెరీర్ దశలో అతిగా దూకుడు ప్రదర్శించకుండా, అలా అని నెమ్మదిగా కాకుండా సానుకూల దృక్పథంతో ఆటలో కొత్త వర్షన్‌ను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నానని కోహ్లీ చెప్పాడు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండటమే ఈ కొత్త విధానానికి కారణమన్నాడు. కోహ్లీ చెప్పిన ఈ మాటలను వైద్య నిపుణులు కూడా శాస్త్రీయంగా బలపరుస్తున్నారు. క్రమం తప్పకుండా చేసే శారీరక శ్రమ మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని వ్యాయామం పెంచుతుందన్నాడు విరాట్ కోహ్లీ. శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులలో ఒత్తిడి హార్మోన్లు తక్కువ స్థాయిలో విడుదలవుతాయని, హృదయ స్పందనల రేటు నెమ్మదిగా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ విధంగా శరీరం, మనసు మధ్య ఉండే బలమైన సంబంధం వల్లే అథ్లెట్లు తీవ్రమైన ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉంటూ మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. మైదానంలో విజయాలకు ఫిట్‌నెస్ ఎలా పునాది వేస్తుందో కోహ్లీ చెప్పిన మాటలు ఈ శాస్త్రీయ వాస్తవానికి సరైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..

ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!

ఏనుగునైనా చంపే కింగ్‌ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!

Follow Us