సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..
హైదరాబాద్‌లో ‘కుబేర’ సినిమా షో 22 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన వ్యవహారం వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. 2025 జూన్ 20న రాత్రి 10:35 గంటల షోకు టికెట్లు తీసుకున్న ప్రేక్షకుడు, 10:52 వరకు కమర్షియల్ యాడ్స్, ట్రైలర్లు ప్రదర్శించారని ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం కమిషన్ సేవలో లోపం, అనుచిత వ్యాపార విధానంగా పేర్కొని రూ.20 వేల పరిహారం, రూ.5 వేల లిటిగేషన్ ఖర్చులు, రూ.50 వేల మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
ఎంటర్‌టైన్మెంట్, మానసిక ఉల్లాసం కోసం సినిమాలకు వెళ్తుంటాం.. సినిమాలు మనల్ని కాసేపు రోజువారీ ఒత్తిడి నుంచి దూరం చేసి, ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంటాయి.. అందుకే.. ఎంత ఖర్చయినా.. ఎంత దూరం ఉన్నా.. వెళ్లి.. థియేటర్‌లో సినిమాలను చూస్తుంటారు. అయితే.. 300 రూపాయలతో టికెట్ కొని, సినిమా టైమ్‌కి థియేటర్‌లో కూర్చుంటే… అసలు సినిమా వేయకుండా 20 నిమిషాలు వరుసపెట్టి వాణిజ్య ప్రకటనలు వేస్తే మీకేమనిపిస్తుంది? చాలామంది ‘అంతేలేబ్బా’ అని ఊరుకుంటారు! కానీ హైదరాబాద్‌కి చెందిన ఒక సామాన్య ప్రేక్షకుడు మాత్రం ఊరుకోలేదు… ‘నా టైమ్‌తో ఆడుకుంటారా?’ అని ఏకంగా కన్స్యూమర్ కోర్టు తలుపు తట్టాడు.. కట్ చేస్తే… సదరు ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్‌కి దెబ్బకి 75 వేల రూపాయల జరిమానా పడింది.. అసలు హైదరాబాద్‌లో ఏం జరిగింది? ఆ ప్రేక్షకుడు కోర్టులో ఎలా గెలిచాడు? ఈ తీర్పు మూవీ లవర్స్‌కి ఎలాంటి పవర్ ఇచ్చింది? ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్‌గా తెలుసుకుందాం! “వివరాల్లోకి వెళ్తే… 2025 జూన్ 20న ధనుష్, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమా చూడటానికి ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్‌లో రాత్రి 10:35 గంటల షోకి రెండు టికెట్లు బుక్ చేసుకున్నాడు. సరైన సమయానికి ఫ్రెండ్‌తో కలిసి థియేటర్‌లో సీట్లో కూర్చున్నాడు. కానీ షో టైమ్ 10:35 దాటినా సినిమా స్టార్ట్ అవ్వలేదు! రాత్రి 10:52 వరకు… అంటే సరిగ్గా 22 నిమిషాల పాటు కమర్షియల్ యాడ్స్, ప్రమోషనల్ ట్రైలర్లు వేస్తూనే ఉన్నారు. దింతో సినిమా ముగిసి ఇంటికి వెళ్లేసరికి అర్థరాత్రి దాటి 3 గంటలు అయ్యింది.. తన అమూల్యమైన సమయాన్ని థియేటర్ యాజమాన్యం వ్యాపారం కోసం వృథా చేసిందని సదరు వ్యక్తి సీరియస్ అయ్యాడు. “ఆ ఆడియన్ ఊరికే ఉండిపోకుండా హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. సమయానికి సినిమా వేయకుండా యాడ్స్ వేయడం సేవా లోపం అని పిటిషన్ ఫోరలో కేసు వేశాడు. ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఏం వాదించిందో తెలుసా? ‘యాడ్స్, ట్రైలర్లు ప్రదర్శించడం రాజ్యాంగం మాకు ఇచ్చిన వ్యాపార హక్కు’ అని చెప్పే ప్రయత్నం చేసింది! కానీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.. ప్రేక్షకులు టికెట్ కొన్నది సినిమా చూడటానికి తప్ప మీ కమర్షియల్ యాడ్స్ చూడటానికి కాదని మండిపడింది. ఇది స్వచ్ఛమైన ‘అనుచిత వ్యాపార ధోరణి’ అంటే.. Unfair Trade Practice అని తేల్చి చెప్పింది. “సుదీర్ఘ విచారణ తర్వాత హైదరాబాద్ వినియోగదారుల ఫోరమ్ మల్టీప్లెక్స్‌కి గట్టి కౌంటర్ ఇస్తూ తీర్పు చెప్పింది.. బాధిత వినియోగదారుడికి నష్టపరిహారంగా 20వేలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. లీగల్ కాస్ట్.. కోర్టు ఖర్చులు కింద కస్టమర్‌కు రూ. 5వేలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్షాత్మక చర్యగా జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50వేలు జమ చేయాలని చెప్పింది. అంటే మొత్తం 75వేలు ఫైన్ విధించింది. గతంలో బెంగళూరులో కూడా సేమ్ ఇలాంటి కేసులోనే ఒక మల్టీప్లెక్స్‌కు ఫైన్ పడింది. ఇప్పుడు హైదరాబాద్‌లో పడటంతో థియేటర్ల యాజమాన్యాలు.. సరిదిద్దుకునే చర్యల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. “ఫ్రెండ్స్… సినిమా టికెట్ ఇచ్చి టైమ్ వేస్ట్ చేసే థియేటర్ల తీరుపై ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరిక! ఒక సాధారణ ఆడియన్ అనుకుంటే వ్యవస్థలో ఎలాంటి మార్పు తేవచ్చో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..

