హైదరాబాద్లోని అమీర్పేట్లో యువ డాక్టర్ హత్య కలకలం రేపింది. హనుమకొండలో పీజీ పీడియాట్రిషియన్ చేస్తున్న డాక్టర్ను ఏడేళ్ల పరిచయం ఉన్న రవికుమార్ అనే వ్యక్తి లాడ్జికి రప్పించి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. బంగారు గొలుసు తిరిగిస్తానని పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు.