ఇరుముడి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన ఆరో వారంలో 3.46 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి, గత 9 ఏళ్లుగా బాహుబలి 2 పేరిట ఉన్న 2.65 కోట్ల రికార్డును బద్దలు కొట్టింది. తెలుగు వెర్షన్ సినిమాల్లో ఆరో వారంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఇరుముడి నిలిచింది.