AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’ ప్రధానికి జెన్ జీ బాలిక తల్లి ప్రశంస !

Samatha J
|

Updated on: Aug 04, 2026 | 2:05 PM

Share

జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలికను ఆయన క్షమించడంతో ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ తన కుమార్తెకు "కొత్త జీవితాన్ని" ప్రసాదించారని పేర్కొన్నారు. ప్రతీకారానికి బదులు క్షమాగుణాన్ని ప్రదర్శించినందుకు ఆమె చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామం అనంతరం బాలిక కూడా క్షమాపణలు కోరింది.

న్యూఢిల్లీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బాలికను మోదీ క్షమించడంతో ఆమె తల్లి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ తన కుమార్తెకు “కొత్త జీవితాన్ని” ప్రసాదించారని పేర్కొంటూ, ప్రతీకార చర్యకు బదులుగా క్షమాగుణాన్ని ప్రదర్శించినందుకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. “ఇంతటి అసభ్యకరమైన పదాలు వాడిన నా బిడ్డను క్షమించి మోదీ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈరోజు తన పుట్టినరోజు. ఈ సందర్భంగా నా బిడ్డకు మోదీ జీవనదానం అనే గొప్ప బహుమతి ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి ఇది పునర్జన్మ” అని ఆమె తెలిపారు.నీట్ యూజీ పేపర్ లీకుకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఓ బాలిక ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, తనపై దూషణలకు పాల్పడిన వారిని మార్గం తప్పినవారిగా అభివర్ణించారు. ఆగ్రహం, ప్రతీకారంతో దీనికి సమాధానం ఇవ్వలేమని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

మళ్లీ మొదటికొచ్చిన డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం

ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది

డబ్బు వాళ్లదే.. కానీ హీరోలు మాత్రం వాళ్లు కాదండోయ్..

పెద్ద రిస్కే తీసుకోబోతున్న అనిల్ రావిపూడి..!

Published on: Aug 04, 2026 02:02 PM
Follow Us