Telangana: ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోన్న ఇందూరు నయాగర జలపాతం.. ఎక్కడంటే..!
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలోని శీలం జానకీబాయి చెరువు అలుగు పోస్తూ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువు పూర్తిస్థాయిలో నిండిపోగా, సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలా నీరు కిందికి దూకుతోంది. దీంతో ఈ ప్రాంతం "ఇందూరు నయాగర జలపాతం"గా మరోసారి సందర్శకులను ఆకర్షిస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నపల్లిలోని శీలం జానకీబాయి చెరువు అలుగు పోస్తూ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువు పూర్తిస్థాయిలో నిండిపోగా, సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలా నీరు కిందికి దూకుతోంది. దీంతో ఈ ప్రాంతం “ఇందూరు నయాగర జలపాతం”గా మరోసారి సందర్శకులను ఆకర్షిస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, జలపాతానికి వెళ్లే రహదారి దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాత్కాలికంగా అయినా రోడ్డును మరమ్మతులు చేసి, సిర్నపల్లి వాటర్‌ఫాల్స్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

